పట్టణం పరిశుభ్రంగా ఉంటేనే ప్రజల ఆరోగ్యం
న్యూస్‌తెలుగు/ వినుకొండ : “స్వభావ స్వచ్ఛతా- సంస్కార్ స్వచ్ఛతా” అన్న నినాదంతో స్వచ్ఛతాహి సేవా 2024 కార్యక్రమంలో భాగంగా బుధవారం స్వచ్ఛతా రన్, మారథాన్ కార్యక్రమంలో భాగంగా ఈ సందర్బంగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి షకీలా మాట్లాడుతూ. పట్టణమంతా పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారన్నారు. అన్ని వార్డుల్లో ఆయా గృహాల వారు తమ ఇళ్లల్లో చెత్తాచెదారాన్ని రోడ్లపై వేయకుండా మున్సిపాలిటీ వారు ఏర్పాటుచేసిన డస్ట్ బిన్లలోనే వేయాలన్నారు. గత కరోనాకాలంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది కార్మికులు ఎనలేని కృషి చేశారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. మున్సిపల్ కమిషనర్ ఎం సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ. వినుకొండ పట్టణం పరిశుభ్రంగా ఉంచడమే తమ ధ్యేయ మనీ మున్సిపల్ సిబ్బందికి ప్రజల సహకరించాలని కోరారు. అలాగే అంటూ వ్యాధులు ప్రబలకుండా మురికివాడల్లో లోతట్టు ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లిస్తున్నట్లు. పట్టణంలో మురుగు కాలవల్లో కూడా దోమల ప్రబలకుండా నివారణ స్ప్రే చేయిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బ్రహ్మయ్య , మునిసిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది, గురుకుల పాఠశాల బాలికలు పాల్గొని విజయవంతం చేశారు. (Story : పట్టణం పరిశుభ్రంగా ఉంటేనే ప్రజల ఆరోగ్యం)