Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ కే. హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం

కే. హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం

0

కే. హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని స్థానిక కే.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రామ్ ఆఫీసర్ డా॥ బి. గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు నడుమ కళాశాల ఆవరణం లో” పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భారత ప్రభుత్వం, క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ అధ్వర్యంలో చేపట్టిన ” స్వభావ్ స్వచ్ఛత – సంస్కార్ స్వచ్ఛత” నినాదంతో సెప్టెంబర్ 17-అక్టోబర్ 2 వరకుఅనేక కార్యక్రమాలు తలపెట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిబ్బంది కళాశాల ఆవరణం లో పెద్ద ఎత్తున పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం చేపట్టడం జరిగింది. రోడ్ల శుభ్రత, రాళ్ళు రప్పల ఏరివేత, పిచ్చిమొక్కలతీసివేత….మొదలైన అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా.కె ప్రభాకర్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మన యింటి ప్రాంగణాన్ని అందరం ఎలా అయితే పరిశుభ్రంగా వుంచుకొంటామో, అదేవిధంగా మన కళాశాల పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవదం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డా. త్రివేణి, డా. ఎస్. షమీవుల్లా, డాక్టర్ బి. గోపాల్ నాయక్, ఎ. కిరణ్ కుమార్, ఎస్ .పావని,యం భూవనేశ్వరి, పుష్పవతి, బి. ఆనంద్, వి.హైమవతి, వై . తాహిర్ అలీ … తదితర అధ్యాపక, అధ్యాప కేతర బృందం మరియు ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. (Story : కే. హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version