ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి
ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
AISF రాష్ట్ర మహాసభల కరపత్రం విడుదల
న్యూస్ తెలుగు/విజయనగరంః ఏఐఎస్ఎఫ్ 49వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభల కరపత్రాలను బుధవారం సాయంత్రం 4 గంటలకు సోమవారం వీధి అడ్వకేట్ ప్రసాదరావు ఇంటి వద్ద మీడియా సమావేశంలో ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విడుదల చేశారు.
ఈ సందర్భంగా జి. ఈశ్వరయ్య మాట్లాడుతూ విద్యలనగరంగా పేరుగాంచిన విజయనగరంలో స్వతంత్ర సంగ్రామం లో ఉజ్వల చరిత్ర కలిగిన ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభలు నవంబర్ 27 నుంచి 30 వరకు జరుపుకోవడం విశేషం అన్నారు విద్య అనేది మనిషి యొక్క జ్ఞానాన్ని పెంపొందించి సమాజంలో అసమానతలకు, అన్యాయాలను, దోపిడీలను, ఎదిరించడంతోపాటు సామాజిక రుగ్మతలపై పోరాడడం ద్వారా ఒక నూతన సమాజాన్ని ఆవిష్కరించేందుకు కృషి చేయాలని ఏఐఎస్ఎఫ్ ప్రజాస్వామిక దేశంలో అందరికీ విద్యా ,వైద్యం,ఉపాధి అవకాశాలు కల్పించాలని పోరాటం చేస్తుందని విజయనగరం జిల్లాలో మహాకవి గురజాడ, శ్రీశ్రీ,, నారాయణ బాబు, చాసో, వంటి సాహిత్య వేత్తలు కు నిలయ మైనటువంటి విజయనగరంలో మహాసభలు నిర్వహించడం ద్వారా వారి స్ఫూర్తితో ముందుకు పోవాలని సూచించారు నవంబర్ 27న జరిగే బహిరంగ సభ విద్యార్థులు ప్రదర్శన భారీ ఎత్తున జరుగుతుందని ఈ బహిరంగ సభకు ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా నాయకత్వం పాల్గొంటుందని విద్యార్థులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.దేశంలో రాష్ట్రంలో విద్యా వ్యతిరేక విధానాల పైన పోరాటం చేస్తున్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని దేశ చరిత్రలోనే అశేష త్యాగాలతో పోరాటంలో పాల్గొన్న విద్యార్థి సంఘం అని నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో సమస్యలు పరిష్కారం చేయాలని అనేక పోరాటాల్లో ఏఐఎస్ఎఫ్ ముందు ఉంది అని ఈ తరుణంలో విజయనగరంలో జరుగుతున్న 49వ రాష్ట్ర మహాసభలు అనేక తీర్మానాలకు, నూతన నాయకత్వానికి ఉత్తేజం నింపే వేదిక కాబోతుందని మహాసభ జయప్రదంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, జిల్లా సహాయ కార్యదర్శులు ఎ ఆనంద్, బుగత అశోక్, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, కోట అప్పన్న ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.నాగభూషణం, ఏఐఎస్ఎఫ్ నాయకులు శ్రావణ్ కుమార్, వికాస్, తదితరులు పాల్గొన్నారు (Story : ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి)