చెకుముకి సంబరాల గోడపత్రిక విడుదల..
న్యూస్‌తెలుగు/ వినుకొండ: జన విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో స్థానిక ఎన్ఎస్పీ కాలనీ పాఠశాల యందు చెకుముకి సంబరాల గోడపత్రికలను జన విజ్ఞాన వేదిక సభ్యులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 8, 9, 10 సైన్స్ విద్యార్థులకు పాఠశాల స్థాయిలో ఈ ప్రతిభా పరీక్షలను ఈనెల 25వ తేదీన నియోజకవర్గంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో నిర్వహించడం జరుగుతుంది అన్నారు. తదుపరి మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గెలిచిన విద్యార్థులకు తగు బహుమతులను ఇవ్వడం జరుగుతుందని జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు జి. కమలారామ్ తెలియజేశారు.
విద్యార్థులలో వైజ్ఞానిక దృష్టిని పెంపొందించేందుకు జన విజ్ఞాన వేదిక కృషి చేస్తుందని ప్రతిభా పరీక్షలు ఆయా తరగతుల సిలబస్ మరియు జనరల్ నాలెడ్జ్ పై ప్రశ్నలు ఉంటాయని ఉపాధ్యాయులు ఆ విధంగా విద్యార్థులను పరీక్షకు సిద్ధం చేయవలసినదిగా జనవిజ్ఞాన వేదిక కార్యదర్శి భాగవతుల రవికుమార్ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు జి కమలా రామ్ భాగవతుల రవికుమార్, అప్పరాజు నాగేశ్వరరావు, భగవాన్ దాస్, శ్రీమతి జ్యోతి, పాఠశాల హెచ్ఎం రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. (Story : చెకుముకి సంబరాల గోడపత్రిక విడుదల..)