చౌక ధరల బియ్యం అక్రమార్కులకు వరంగా మారింది
ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలి
న్యూస్‌తెలుగు/ వినుకొండ : పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న చౌక ధరల బియ్యం అక్రమార్కులకు వరంగా మారిందని వినుకొండ నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు అన్నారు. వినుకొండ పట్టణంలో రేషన్ కార్డుదారులకు రేషన్ బియ్యనికి బదులు డబ్బులు ఇస్తాం తీసుకోవాల్సిందేనంటూ గత కొద్ది నెలలుగా రేషన్ కార్డు దారులను రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందుల గురి చేస్తుండడంతో బుధవారం సిపిఐ పార్టీ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో బుధవారం వినుకొండ మండల తాసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బూదాల శ్రీనివాసరావు గత కొద్ది నెలలుగా బియ్యం ఇవ్వమని రేషన్ బియ్యానికి బదులు డబ్బులు తీసుకోవాల్సిందేనంటూ కార్డుదారులను రేషన్ డీలర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు డబ్బులు ఇస్తుందా బియ్యం ఇస్తుందా అని అయన అధికారులను నిలదీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలకు కనీసం రెండు పూటల ఆహారం అందించాలనే తలంపుతో ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చాయని, అయితే ఎండియు వాహనాల ద్వారా రేషన్ పంపిణీ జరగాల్సి ఉండగా అధికారులు నిర్లక్ష ధోరణితో వ్యవహరిస్తున్న కారణంగా
యం డి యు నిర్వాహకుడి వేలుముద్రతో రేషన్ డీలర్లే తమ షాపుల వద్ద లబ్ధిదారులకు సరఫరా చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ బియ్యనికి బదులు డబ్బులు తీసుకుంటే తీసుకోండి లేదంటే మీ ఇష్టం వచ్చింది చేస్కోండి అంటూ కొందరు రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడుతూ జేబులు నింపుకుంటున్నారన్నారు. ఒకపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా పరిపాలన అందించాలని పదేపదే చెబుతున్న కిందిస్థాయిలో మాత్రం రేషన్ డీలర్లు బియ్యం దగ్గర కూడా అవినీతి మయం చేస్తున్నారని ఈ విషయం పై ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో వినుకొండ పట్టణంలోని ప్రజలందరి సహకారంతో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు అర్జీలు పెట్టిస్తామని అధికారులను హెచ్చరించారు”. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఉలవలపూడి రాము, పిన్నబోయిన వెంకటేశ్వర్లు ,కొప్పరపు మల్లికార్జున, సోమవరపు దావీదు, పొట్లూరు వెంకటేశ్వర్లు, తారా సాంబయ్య, SK మస్తాన్, తదితరులు పాల్గొన్నారు. (Story : చౌక ధరల బియ్యం అక్రమార్కులకు వరంగా మారింది)