పరిటాల పుట్టినరోజున సందర్భంగా రక్తదాన శిబిరం
పరిటాల టీమ్
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ పుట్టినరోజు వేడుకలు ఈనెల 22న నిర్వహించనున్న రు. ఈ సందర్భంగా బత్తలపల్లి పరిటాల టీం వారు బత్తలపల్లి లోని ఆర్కే ఫంక్షన్ హాల్-అనంతపూర్ రోడ్డు నందు నిర్వహిస్తున్నట్లు బత్తలపల్లి పరిటాల టీం నిర్వాహకులు తెలిపారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ అన్నం దానం చేయవచ్చునని డబ్బు కూడా దానం చేయవచ్చునని కానీ అన్ని దానాల కంటే రక్తదానం ఎంతో గొప్పదని తెలిపారు. రక్తం ఇచ్చే వారు అది వేరొకరికి ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని తెలిపారు. ఈ శిబిరం ఉదయం 9 గంటల నుండి సాయంకాలం నాలుగు గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. రక్తదానం మరొకరికి ప్రాణదానమవుతుందని, అంతేకాకుండా తల సేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి ఈ రక్తం మరింత కాలం బ్రతికిస్తుందని తెలిపారు. కావున అధిక సంఖ్యలో ఈ రక్తదాన శిబిరానికి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు తెలిపారు. (Story : పరిటాల పుట్టినరోజున సందర్భంగా రక్తదాన శిబిరం)