Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వినుకొండలో అంగన్‌వాడి మాసోత్సవాలు

వినుకొండలో అంగన్‌వాడి మాసోత్సవాలు

0

వినుకొండలో అంగన్‌వాడి మాసోత్సవాలు

న్యూస్‌తెలుగు/ వినుకొండ : వినుకొండ జాషువా కళా ప్రాంగణం ఆవరణలో అంగనవాడి మాసోత్సవాలు, అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్.సి.పి.ఆర్.సి. మేడం బత్తుల పద్మావతి, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉమారాణి, వినుకొండ ప్రాజెక్ట్ అనురాధ, వినుకొండ మున్సిపల్ కమిషనర్ ఎం. సుభాష్ చంద్రబోస్, ఎంపీడీవో పాల్గొని అంగన్వాడి కార్యకర్తలు ఏర్పాటుచేసిన పౌష్టిక ఆహారం స్టాల్స్ ను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సభకు వినుకొండ ప్రాజెక్ట్ డైరెక్టర్ అనురాధ సభ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి బత్తుల పద్మావతి మాట్లాడుతూ. ఈ మాసం అంతా మాతా శిశు సంరక్షణ తో పాటు ఆరోగ్యకరమైన దేశ నిర్మాణం దిశగా కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న పోషణ అభయాన్ పోషణ మాసాన్ని నెల రోజుల పాటు ప్రజలకు అవగాహన కల్పించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ ట్రాకర్ ఆర్గనైజేషన్ లో ప్రతిబిడ్డ యొక్క బరువు ఎత్తు ఆన్లైన్ చేయడం జరిగిందని, గర్భిణీలకు బాలింతలకు పోషకాహారం పరమ శ్రేష్టమని, అందరూ తగిన అవగాహనతో పోషక విలువలు గల ఆహారాన్ని తీసుకోవాలని, పౌష్టికాహారం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని, రక్తహీనత సమస్యలు తలత్తవని, ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలో గ్రామ గ్రామాన మరియు వాడవాడలలో ముమ్మరంగా అవగాహన సదస్సులు ర్యాలీలు నిర్వహిస్తున్నామని, తద్వారా ప్రజలందరూ పౌష్టికాహారం పై అవగా అవగాహన పెంపొందించుకుంటారని, చిన్నారులు తిన్న ఆహారం వంటపట్టడానికి నులు పురుగులు నివారణ మాత్రలు ఆల్బెండజోల్ బిల్లలు వాడాలని, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే ఆహార పదార్థాలే కాకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు గల ఆహారాన్ని తీసుకున్నట్లయితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. సిడిపిఓ మాట్లాడుతూ ప్రతి అంగన్వాడి కేంద్రాలలో పాఠశాలలలో జాతీయ నులిపురుగుల దినోత్సవం నిర్వహిస్తున్నారని, ఇంకా ఇతర ప్రవేట్ స్కూల్ వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవడం, బయట తిరిగేటప్పుడు బూట్లు,చెప్పులు ధరించాలి. భోజనం తినే ముందు తిన్న తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం మంచి అలవాట్లని ఆరోగ్య సమస్యలకు దూరం ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగనవాడి కార్యకర్తలు, పోషక విలువల గల ఆహార పదార్థాలను వంటకాల ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పాల్గొన్నారు. (Story : వినుకొండలో అంగన్‌వాడి మాసోత్సవాలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version