వేప చెట్టును కొట్టి అడ్డంగా వేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : వేప చెట్టును కొట్టేసి అడ్డంగా వేసి అందరికీ ఇబ్బంది కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో పట్టణ ఆరోగ్య కేంద్రం లోకి వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు అని సతీష్ యాదవ్ తెలిపారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న దవఖాన నిర్వహణను ఈ రకమైన పనుల వల్ల ప్రజలకు నానా ఇబ్బందులకు అందిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. తూతూ మంత్రంగా మొక్కలు నాటడం వాటి పేరుతో పైసలు సంపాదించడం, ఉన్న చెట్లను కొట్టివేయడం సంపాదించడం వనపర్తిలో పరిపాటిగా మారింది. చిన్నపిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే ఇబ్బంది, దానికి తోడు లోపలికి వెళ్ళకుండా పెద్ద పెద్ద మోద్దులు వేసి ఇబ్బంది కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని, అలాగే చెట్టు ఎందుకు కొట్టివేశారు ప్రజలకు సమాధానం చెప్పాలని ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది వెంటనే ఇక్కడి పరిస్థితులను సరిచేసి ఆరోగ్య కేంద్రాలలో వసతి కల్పన చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అని తెలిపారు. (Story : వేప చెట్టును కొట్టేసి అడ్డంగాన వారిపై చర్యలు తీసుకోవాలి)