వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి
పాము కాటుకు ఒక వ్యక్తి ..ఇంటి గోడ కూలి మరో వ్యక్తి మృతి
న్యూస్ తెలుగు/సాలూరు : తన పెద పాపకు పాము కరుస్తుందని భయంతో. ఆ పామును పట్టుకొని చెయ్యితో తీస్తుండగా పాము కరిచి మరణించిన సంఘటన పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెట్ట మండలం ఎగువ గొట్టూరు జరిగింది ఈ గ్రామానికి చెందిన సేబి శీను 24 మృతి చెందాడు శ్రీను తన కుటుంబ సభ్యులతో ఆదివారం రాత్రి పడుకున్నాడు తెల్లవారుజామున ఇంటి పై కప్పు నుంచి ఒక పాము వచ్చి పెద్ద కుమారి కాలు పైన ప్రాకుతో ఉండడం చూసి అది గమనించిన శ్రీను పామును పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకున్న సమయంలో శీను చెయ్యకు పాము కారడంతో మొదటి ఏం కాదని నొప్పి లేదని ఇంటి దగ్గరే ఉండి పోవడం జరిగింది . తర్వాత నొప్పి ఎక్కడ అవ్వడంతో గురువు నాయుడుపేట పి హెచ్ సి హాస్పిటల్ కు చికిత్సకు వెళ్లడం జరిగింది. అప్పటికే పరిస్థితి విషమించడంతో శ్రీనును సాలూరు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో శ్రీను మరణించడం జరిగిందని పాచిపెంట ఎస్ఐ సురేష్ తెలిపారు.
మరో సంఘటనలో సాలూరు పట్టణం కొంకి వీధికి చెందిన హరితవుడు ఆర్టీసీ లో రోజువారి కూలి పనులు చేస్తున్నాడు. ఇతడు పక్కింటి వారి గోడ ఎక్కి తాడు కడుతుండగా గోడ కూలి న సంఘటనలో తౌడు కి తీవ్ర గాయాలు అయ్యాయి. హాస్పిటల్లో తౌడు చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. (Story : వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి)