వినుకొండలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం
న్యూస్తెలుగు/ వినుకొండ : వినుకొండ మండల పరిషత్ కార్యాలయం నందు స్వచ్ఛత హి సేవ 2024 కార్యక్రమంలో భాగంగా మండల కార్యాలయం నందు మంగళవారం పంచాయతీ కార్యదర్శులకు , పంచాయతీ సర్పంచులకు వివిధ శాఖల అధికారులకు స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత అవగాహన కల్పించడం జరిగింది. స్వచ్ఛతాహి సేవ సమావేశం నిర్వహించిన అనంతరం మానవహారాన్ని ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డి సుందర్ రామిరెడ్డి మాట్లాడుతూ మీ మీ గ్రామాల్లో మీకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమం నిర్వహించి ఫొటోస్, వీడియోని అప్లోడ్ చేయాలని బ్రదక పంచాయతీ కార్యదర్శి తమ 26 గ్రామపంచాయతీలలో రోజుకు ఒక కార్యక్రమం నిర్వహించి ఫొటోస్ అప్లోడ్ చేయాలని, అట్లా చేయని యెడల చర్యలు తీసుకుంటమని అన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ సైట్ లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి సైట్ తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని తెలిపారు. ఎంఆర్సి ప్రభాకర్ రావు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. (Story : వినుకొండలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం)