ఎమ్మెల్యే చోరవతో ఇంటి నిర్మాణం
న్యూస్తెలుగు/ వినుకొండ : ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ 2019 సంవత్సరంలో మొదట విడత రుణమును పొందిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో స్కీమును తీసివేయగా కేవలం కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ద్వారా ఇంటి నిర్మాణం చేపట్టి తిరిగి టిడిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు ఆదేశాలమేరకు మంగళవారం వినుకొండ పట్నంలో 14 వ వార్డులో శ్రీమతి ఆరే మాధవి ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమానికి హోసింగ్ ఏడి శ్రీనివాసరావు మున్సిపల్ కమిషనర్ చంద్రబోస్, ప్రారంభించారు. ఈ సందర్భంగా మాధవి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన అయూబ్ ఖాన్, రాష్ట్ర కార్యదర్శి షమీంఖాన్, క్లస్టర్ ఇంచార్జ్ లు పత్తి పూర్ణచంద్రరావు, సౌదాగర్ జానీ భాష, పివి సురేష్ ,బాబు అజీజు ,గంగినేని సుబ్బారావు, నాసరయ్య, ఐర్ల ప్రసాదు ,సురేష్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.