ఉద్యోగం, ఉపాధి అవకాశలకోసం ఉద్యమిస్తాం
ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి
ఆర్ ఎస్ పి పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు
పి ఎస్ యు విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంజుల నరేంద్ర
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానలను తిప్పి కొట్టె విధంగా ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని రెవల్యూషనరి సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకులు తెలిపారు. ధర్మవరం లోని వారి కార్యాలయంలో ఆర్ ఎస్ పి పార్టీ సత్యసాయి జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం సమావేశాన్నిద్దేశించి శ్రీనివాసులు మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచినప్పటినుండి దేశంలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధగా నేడు దేశంలో 27.7 శాతం నిరుద్యోగులు వున్నారని ఘనంకాల అధికారులు తెలియజేయడం జరుగుతుందని పర్ర్కొన్నారు. నిత్యావసర సరుకుల ధరలురోజు,రోజుకు పెరిగిపోవడంతో ప్రజల కొనగోలు శక్తీ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయివేటికరణను ప్రోత్సహించడం వల్ల, ప్రభుత్వ సంస్థలు మూతపడి, లక్షల్లో ఉద్యోగాలు కోల్పోవడం జరిగిందన్నారు. ప్రజల హక్కులను హరిస్తున్న ప్రభుతలపై ఉద్యమాల ఉదృతం చేస్తామని తెలిపారు. ప్రత్యేక హోదా, పరిశ్రమ,కోసం,ఉద్యోగం, ఉపాధి అవకాశలకోసం, విద్యా రంగ సమస్యల పరిష్కారాలపై దశలవారి పోరాటాలు చేయబోతున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో ఆర్ ఎస్ పి పార్టీ తిమ్మక్క శ్రీరాములు తిప్పన్న, వేణుగోపాల్, నరసింహులు, వెంకటరమణ, పి ఎస్ యు నాయకులు నందకిషోర్, సాయి, భరత్, తదితరులు పాల్గొన్నారు. (Story : ఉద్యోగం, ఉపాధి అవకాశలకోసం ఉద్యమిస్తాం)