Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ క్రీడలతో శారీరిక ..మానసిక ఆరోగ్యం 

క్రీడలతో శారీరిక ..మానసిక ఆరోగ్యం 

0

క్రీడలతో శారీరిక ..మానసిక ఆరోగ్యం 

గ్రామీణ క్రీడాకారులు జాతీయస్థాయికి ఆడేలా ఎదగాలి

క్రీడల కోసం ఆర్డిటి చేస్తున్న కృషి అభినందనీయం

ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి సత్య కుమార్ యాదవ్

న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : క్రీడలతో శారీరిక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా లభిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ధర్మవరంలో జరుగుతున్న అటల్ బిహారీ వాజ్పేయి క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ముఖ్యఅతిథిగా మంత్రి సత్య కుమార్ హాజరయ్యారు. సోమవారం జరిగిన ఫైనల్స్ మ్యాచుల్లో స్టార్ 11 టీం, ఇండియన్ 11 కేటీసీ జట్లు పాల్గొనగా
స్టార్ 11 టీం, మీద ఇ 11 కేటీసీ టీం 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. టోర్నమెంట్ విన్నర్స్ మరియు రన్నర్స్ కు మంత్రి , ఆర్డిటి చైర్మన్ మంచో ఫెర్రర్ లు లక్ష రూపాయల చెక్కు తో పాటు ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రీడలను చదువులో భాగంగా చూడాలన్నారు. క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వం చక్కటి అవకాశాలు కల్పిస్తుందని, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన తెలిపారు. జిల్లాలో ఆర్డీటీ సంస్థ క్రీడల కోసం చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన కొనియాడారు. ఎంతోమంది నైపుణ్యం ఉన్న క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చారని తెలిపారు. అనంతపురంలో దిలీప్రోఫీ లాంటి జాతీయస్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు అంటే అది ఆర్డిటి కృషి అని పేర్కొన్నారు. ఈ మ్యాచుల్లో తన ప్రతిభను చూపిన ఇండియన్ 11 కేటీసీ టీం గణేష్ రాయ్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు మరియు బెస్ట్ బౌలర్ దక్కింది అని, మేడాపురం టీం నరేష్ కి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్, ఎగ్ రైస్ టీం భరత్ టోర్నీలో బెస్ట్ బ్యాటర్ దక్కడం జరిగిందన్నారు..ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మంచో ఫెర్రర్, మంత్రి కార్యాలయ సిబ్బంది హరీష్, బిజెపి నాయకులు డోలా రాజారెడ్డి, డి చెర్లోపల్లి నారాయణస్వామి, అంబటి సతీష్, ఎర్రజోడు లోకేష్, జింక చంద్ర శేఖర్, సాకే ఓబ్లేస్, ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు. (Story : క్రీడలతో శారీరిక ..మానసిక ఆరోగ్యం )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version