Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ తిరుచానూరు  పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు  అంకురార్ప‌ణ‌

తిరుచానూరు  పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు  అంకురార్ప‌ణ‌

0

తిరుచానూరు  పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు  అంకురార్ప‌ణ‌

న్యూస్‌తెలుగు/తిరుప‌తి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వ‌హించారు. ఆలయంలో సెప్టెంబరు 16 నుంచి 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్ర‌హణం,సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వ‌హించారు.

ఆలయంలో సంవత్సరం పొడవునా పలు క్రతువుల్లో తెలియక జరిగిన దోషాల నివారణకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

ప‌విత్రోత్స‌వాల్లో భాగంగా సెప్టెంబరు 16వ తేదీన పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 17న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 18న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు. భ‌క్తులు ఒక్కొక్క‌రు రూ.750/- చెల్లించి ఒక‌ రోజు ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్థులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ గోవింద‌రాజ‌న్‌, ఏఈవో శ్రీ ర‌మేష్, అర్చ‌కులు శ్రీ బాబుస్వామి, సూప‌రింటెండెంట్ శ్రీ శేషగిరి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ సుభాష్‌, శ్రీ గణేష్ పాల్గొన్నారు. (Story : తిరుచానూరు  పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు  అంకురార్ప‌ణ‌)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version