UA-35385725-1 UA-35385725-1

మానవ తప్పిదంతో ప్రజల కడగండ్లు

మానవ తప్పిదంతో ప్రజల కడగండ్లు

జలదిగ్బందంలోనే నందమూరి నగర్‌ బాదితులు
కిలో మీటరు పరిదిలో రహదారిపై 11 చోట్ల గండ్లు
నాలుగు రోజులుగా నగరకయాతన
ఫిర్యాదు చేసినా పట్టించుకున్న నాధుడు లేడు..

న్యూస్‌ తెలుగు/విజయవాడ : ప్రకృతి కనికరించినా పాలకులు కనికరించక పోవటంతో విజయవాడ సింగ్‌నగర్‌ ప్రజలు కడగండ్లుతోనే కాలం వెల్లదీస్తున్నారు. భారీ వర్షాలు, వరదలు వీడి వారం రోజులు కావస్తున్నా సింగ్‌నగర్‌లోని నందమూరి నగర్‌ ప్రజలకు మాత్రం మోక్షం కలకపోగా సమస్యలు మరిన్ని పెరిగాయి. వరదల్లో చిక్కుకుని అల్లాడిన జనం బతుకుజీవుడా అంటూ ఇంతర ప్రాంతాలకు వెళ్లి వరద తగ్గుముఖం పట్టటంతో నాలుగు రోజుల క్రితం సొంతిళ్లకు తిరిగివచ్చి అన్నీ చక్కబెట్టుకుంటుండగా జక్కంపూడి వైపుల రోడ్డుకు గండ్లు కొట్టటంతో ఈ ప్రాంత ప్రజలకు బాహ్య ప్రపంచంతో మరల సంబందాలు తెగిపోయాయి. అర్ధరాత్రి సమయంలో రెండు రోజుల వ్యవదిలో సింగ్‌నగర్‌ నుంచి జక్కంపూడి, వైఎస్‌ఆర్‌ కాలనీ, మిల్క్‌ప్రాజెక్టు, సితార, కబేళా సెంటర్‌, భవానీపురం తతితర ప్రాంతాలకు వెళ్లే సింగ్‌నగర్‌ ఇన్నర్‌బైపాస్‌(100 అడుగుల రోడ్డు)లో 11చోట్లు గండ్లు కొట్టి వదిలేశారు. దీంతో వరదలు తగ్గి ఇళ్లకు చేరుకున్న అనేక కుటుంబాలు మరల అష్టదిగ్బందంలో చిక్కుకుపోయారు. ప్రధాన రహదారికి కొట్టిన గండ్లు కారణంగా కనీసం మనిసి నడకమార్గానైనా బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పండిరదని, మొన్న వరద కారణంగా సర్వం కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే మానవ తపిదం వల్ల తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని నందమూరి నగర్‌ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాహ్య ప్రపంచంతో సంబందాలు తెగిపోవటంతో వృద్దులు, కూలీలు, విద్యార్ధులు మూడవేదన అనుభవిస్తున్నారు. కనీసం కాలబాటయినా ఏర్పాటు చేయాలని విజయవాడ రూరల్‌ తహసీల్దార్‌, ఎంపీడీవోకు స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు కన్నీటి పర్వంతమయ్యారు.

రహదారికి గండ్లు కొట్టటంతో ప్రజల కడగండ్లు
సింగ్‌నగర్‌ నుంచి జక్కంపూడి వెళ్లే పైపుల రోడ్డుకు గండ్లు కొట్టటంతో నందరమూరి నగర్‌ ప్రజలు ఇంకా జలదిగ్బందంలోనే అల్లాడుతున్నారు. వరద తగ్గిందని ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో కొందరి అనాలోచిత, నిర్లక్ష ఆలోచనతో వరద సమస్యలు మరల మొదటికొచ్చాయని, కనీసం కాలిబాటకూడా లేకుండా రోడ్డు మొత్తం ద్వంసం చేసి వదిలేయటంతో ఈ ప్రాంత ప్రజలు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద, వర్షాల నుంచి సింగ్‌నగర్‌ ప్రజలు బయటపడితే అదే ప్రాంతంలోని నదరమూరి నగర ప్రజలు మాత్రం బాహ్య ప్రపంచటంతో సంబందాలు లేకుండా జీవశ్చవాల్లా బతుకులీడుస్తున్నారు. ప్రజలకు ఏ వస్తువు కావాలన్నా ఈ మార్గనే రాకపోకలు సాగిస్తుంటారు. ఏమాత్రం సమాచారం లేకుండా రాత్రికి రాత్రి లక్షలాది మంది వినియోగించే రహదారిపై 11 రోట్ల భారీ గండ్లు కొట్టి వదిలేయటం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నాలుగు రోజులుగా నగరకయాతన
జక్కంపూడి పైపుల రోడ్డుకు గండ్లు కొట్టటంతో ఇంట్లో ప్రజలు బయటకు వచ్చేందుకు, బయట ప్రజలు ఇంట్లోకి వెళ్లేందుకు వీలులేక నాలుగు రోజులుగా నందమూరి నగర ప్రజలు నగరక యాతన అనుభవిస్తున్నారు. రహదారికి అనుకుని ఉన్న పలు గృహాల్లో వందలాది మంది కుటుంబాలు నివాసాలుంటున్నారు. రహదారికి పక్కనే ఉన్న సీఎంఆర్‌ వేణుగానం ఒక్క అపార్టుమెంట్‌లోనే 40 కుటుంబాలుంటున్నాయి. వీరిలో 60 నుంచి 80 ఏళ్ల వయస్సున్న వృద్దులు, స్కూలు, కళాశాల విద్యాలున్నారు. ఏవస్తువు కావాలన్నా రెండు, మూడు కిలో మీటర్లు దూరం వెళ్లాల్సి ఉంది. కాలిబాటకూడా లేకుండా గండ్లు కొట్టటంతో నిత్యావసర వస్తువులకు, స్కూల్స్‌, కాలేజీలకు వెళ్లలేకు నరకయాతన అనుభవిస్తున్నామని అపార్టుమెంట్‌ వాసులు చెబుతున్నారు. (Story : మానవ తప్పిదంతో ప్రజల కడగండ్లు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1