మెకానిక్‌లు, నిర్మాణ రంగ కార్మికులకు అండగా ఉంటాం
శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బైక్ మెకానిక్‌లకు టూల్ కిట్ల పంపిణీ
ఎమ్మెల్యే జీవీ, మాజీ ఎమ్మెల్యే మక్కెన
న్యూస్‌తెలుగు/వినుకొండ : మెకానిక్‌లు, నిర్మాణరంగ కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉండి వారికి గౌరవప్రదమై జీవితం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలుగుదేశం పార్టీ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయుులు అన్నారు. కష్టపడి పనిచేసే ప్రతికుటుంబం సంతోషంగా ఉండాలని…., అందులో తమవంతు సాయం ఉండడం ఎంతో సంతృప్తినిచ్చే విషయంగా భావిస్తానన్నారు. వినుకొండ ఎంఎల్ఏ కార్యాలయంలో శనివారం పెద్దసంఖ్యలో బైక్ మెకానిక్‌లకు టూల్ కిట్లు పంపిణీ చేశారు. శివశక్తి ఫౌండేషన్ ద్వారా నవ్యాంధ్ర టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు చెందిన 120 మంది బైక్ మెకానిక్‌లకు 120 టూల్ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మక్కెన మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా పాల్గొని మెకానిక్‌లకు టూల్ కిట్లు అందించారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే జీవీ విజయవాడలో వరద ఉద్ధృతికి వేలాది వాహనాలు దెబ్బతిన్నాయని, వాటికి మరమ్మతులు చేయడానికి మెకానిక్‌లు సరిపోవడం లేదని, ఇలాంటి తరుణంలో నవ్యాంధ్ర టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అక్కడకు వెళ్లి బైక్‌లకు ఉచిత మరమ్మతులు చేస్తామనడం సంతోషంగా ఉందన్నారు. వారు భవిష్యత్తులో ఇదే తరహా సేవాభావంతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నానని, తన అండదండలు ఎల్లప్పుడూ యువతకు ఉంటాయన్నారు. విజయవాడ వరద సహాయక చర్యల్లో పాల్గొని విశేష సేవలందించిన వినుకొండ పురపాలక కమిషనర్, సిబ్బందిని కూడా ఈ వేదిక ద్వారా జీ.వీ ఆంజనేయులు అభినందించారు. కమిషనర్ సుభాష్ చంద్రబోస్‌ను శాలువాతో సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే సీఎం చంద్రబాబును అడిగి వినుకొండ ఘాట్ రోడ్ నుంచి షాదీఖానా, తితిదే కల్యాణ మండపానికి రూ.3 కోట్లు, రామలింగేశ్వరస్వామి గుడి నిర్మాణానికి రూ.2 కోట్లు సాధించుకోవడం జరిగిందన్నారు. ప్రతి ఇంటికీ ప్రతిరోజూ మంచినీరు ఇవ్వాలన్నదే లక్ష్యమని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ఇల్లు ఇస్తామని, రాష్ట్రంతో పాటు వినుకొండ లో ఇల్లులేని పేదలు ఉండకూడదన్నదే సీఎం చంద్రబాబు, తన సంకల్పమని వెల్లడించారు. అలానే తెదేపా ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి, గుట్కాను పూర్తిగా నియంత్రించాలని పోలీస్ శాఖకు ఆదేశాలిచ్చారని, యువత వ్యసనాల బారిన పడకుండా పటిష్ట చర్యలు తీసుంటామన్నారు. చిన్న కుటుంబమైనా ఆనందంగా ఉండాలంటే దురాలవాట్లు, వ్యసనాలకు లోనుకాకూడదని సూచించారు. ప్రతి కుటుంబం బాగుంటే సమాజం బాగుటుందన్నారు. ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం ద్వారా చేతనైనంత వరకు సాయం చేస్తామన్నారు. భవిష్యత్తులో ఆటోనగర్‌కు సాయం చేస్తామని, ప్రభుత్వ స్థలం దొరికినప్పుడు ఆటోనగర్ ఫేజ్-2ను కూడా పరిశీలనలోకి తీసుకుంటామని చెప్పారు. బైక్ మెకానిక్‌లకు టూల్ కిట్లు పంపిణీ చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగానే నవ్యాంధ్ర టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గతంలో తమకు ఇచ్చిన మాట ప్రకారం టూల్ కిట్లు పంపిణీ చేసి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట నిలబెట్టుకున్నారని, అందుకు ఆయనకు రుణపడి ఉంటామని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర టిడిపి కార్యదర్శి షమీంఖాన్ ,పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పఠాన్ అయిబి ఖాన్, టిడిపి నాయకులు పత్తి పూర్ణచంద్రరావు గోల్డ్ కరిముల్లా, చికెన్ బాబు, అజీజ్, అక్బర్ బాషా, జనసేన పార్టీ నాయకులు యూసఫ్ బైక్ మెకానిక్ యూనియన్లు. పాల్గొన్నారు. (Story : మెకానిక్‌లు, నిర్మాణ రంగ కార్మికులకు అండగా ఉంటాం)