సేవలు అభినందనీయం
న్యూస్‌తెలుగు/కొమురం భీం జిల్లా:బెజ్జూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో బదిలీపై వెళ్తున్న వ్యవసాయ అధికారులను ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కరీంనగర్ జిల్లా మామిడిలకు ఏవో రాజుల నాయుడు, పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ కు ఏఈఓ రవితేజ బదిలీ అయ్యారు.మండలంలోని వ్యాపారులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, పాత్రికేయులు, నాయకులు పూలమాలలు వేసి,సాల్వలతో ఘనంగా సత్కరించి అధికారుల సేవలను కొనియాడారు.(Story:సేవలు అభినందనీయం)