Home వార్తలు తెలంగాణ అంబేద్కర్ వ్యక్తి కాదు శక్తి

అంబేద్కర్ వ్యక్తి కాదు శక్తి

0

అంబేద్కర్ వ్యక్తి కాదు శక్తి

న్యూస్‌తెలుగు/వనపర్తి : పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామంలో ఘనంగా డాక్టరు బి ఆర్ అంబేద్కర్ గారి ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లేల చిన్నారెడ్డి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర తెలియజేస్తూ వారి జీవితం నేటి యువతకు మార్గదర్శకం, ఎంతో పేదరికంలో దళిత కుటుంబంలో జన్మించిన ఎంతో కష్టపడి చదివి,విజ్ఞానానికి ప్రపంచానికి దిక్సూచి గా నిలిచారని కొనియాడారు, దేశ స్వతంత్ర ఉద్యమంలో దేశ పునర్నిర్మాణంలో వారు చేసిన సేవలను తెలియజేస్తూ వారి ఆశయ సాధకులుగా చేయాల్సిన బాధ్యతలను వివరించడం జరిగింది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఏదో ఒక వర్గానికి చెందినవారు కాదని ఈ దేశానికి సంబంధించిన విజ్ఞానమని తెలిపారు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహిళలకు ఓటు హక్కు కల్పించడం,బడుగు బలహీన వర్గాలను అన్ని రంగాల్లో రాణించడానికి వారి చూపిన దారి, దేశంలో అత్యున్నతమైన రాజ్యాంగాన్ని నిర్మించడంలో వారి కృషి, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సమాజసేవ రాజకీయ ప్రవేశం వివరించడం జరిగింది, కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వివిధ స్థాయిల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు వివిధ సంఘాల నాయకులు కంచరాపల్లి గ్రామ ప్రజలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి యువజన విభాగం తదితరులు పాల్గొన్నారు. (Story : అంబేద్కర్ వ్యక్తి కాదు శక్తి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version