కళాశాల వసతి గృహాల ఏర్పాటుకు చర్యలు-జిల్లా కలెక్టర్ వెంకటేష్
న్యూస్తెలుగు/కొమరం భీమ్ జిల్లా: వచ్చే విద్య సంవత్సరంలో ప్రభుత్వB.Sc Nursing, విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా కళాశాల, వసతి గృహాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శనివారం జిల్లాలోని ఆసిఫాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ బి.ఎస్.సి. నర్సింగ్ కళాశాల, వసతి గృహాల ఏర్పాటు కొరకు ప్రతిపాదిత భవనాలను పరిశీలించారు వచ్చే విద్యా సంవత్సరంలో నర్సింగ్ విద్య అభ్యసించే విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.(Story:కళాశాల వసతి గృహాల ఏర్పాటుకు చర్యలు-జిల్లా కలెక్టర్ వెంకటేష్)