అటకెక్కిన వినాయకసాగర్!
న్యూస్‌తెలుగు/తిరుపతి: తిరుపతికి ఓ మణిహారంలా నిలిచిన వినాయక సాగర్ లో అభివృద్ధి అటకెక్కింది. సుమారు 20 కోట్లకు పైగా వెచ్చించి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వినాయక్ సాగర్ పేరు గొప్ప ఊరు దిబ్బ ఆన్న చందంగా తయారు అయ్యింది. గత ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వినాయక సాగర్ లోని వ్యాయామ పరికరాలు పూర్తిగా పాడై పోయాయి.

దీంతో అక్కడి వాకర్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని వ్యాయామ పరికరాలు ఉపయోగించి పాడై పోగా మరి కొన్ని పరికరాలు వాడ కుండా తుప్పు పట్టి పాడై పోతున్నాయి. దీనిపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వినాయక సాగర్ వాకార్స్ కోరుతున్నారు. (Story : అటకెక్కిన వినాయకసాగర్!)

