అంకితభావంతో పనిచేసే వారికి గుర్తింపు ఉంటుంది
న్యూస్‌తెలుగు/వినుకొండ : ఏ వృత్తిలోనైనా అంకితభావం తో పనిచేసే వారికి సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని బొగ్గరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్. వీరప్పయ్య అన్నారు. స్థానిక కృష్ణవేటి డిగ్రీ కాలేజీలో సఫల కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో శావల్యాపురం లో పరిషత్ ఉన్నతపాఠశాల ఉపాధ్యాయులైన కే. శ్రీనివాసరాజు ని ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు పొందిన సందర్భంగా ఘనంగా సత్కరించారు.
ఈ ఈ సందర్భంగా వీరప్పయ్య మాట్లాడుతూ – యన్.యమ్.యమ్. యస్., పదోతరగతి, ఇంటర్మీడియట్ కోర్సులలో గణితం లో తన దైన శైలిలో బోధిస్తూ విద్యార్థుల అభిమానాన్ని చూరగొన్నారని, స్కూల్ సమయం అయిపోయిన తర్వాత కూడ అదనంగా మరో రెండు గంటలు ట్యూషన్ చెబుతూ తన సేవలను కొనసాగిస్తున్నారని వారన్నారు. కార్యక్రమాలో కళాశాల కరస్పాండెంట్ పి. సీతారాం,
ప్రిన్సిపాల్. యోగి, అధ్యాపకులు జి. చినగోవిందు,కే. ప్రసాద్ బాబు ,టి.శ్రీనివాసరావుఎల్. అంజిరెడ్డి,యల్. రామాంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. (Story : అంకితభావంతో పనిచేసే వారికి గుర్తింపు ఉంటుంది)