UA-35385725-1 UA-35385725-1

పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి “పోలీసు వెల్ఫేర్ డే”

పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి

“పోలీసు వెల్ఫేర్ డే”

జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

న్యూస్‌తెలుగు/విజయనగరం : జిల్లా పోలీసుశాఖలో వివిధ హెూదాల్లో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు వెల్ఫేర్ డే నిర్వహించి, సిబ్బంది నుండి విజ్ఞాపనలు స్వీకరించి, పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, పోలీసు సంక్షేమానికి ప్రాధాన్యత కల్పిస్తానన్నారు. “పోలీసు వెల్ఫేర్ డే” నిర్వహించుటలో భాగంగా పోలీసు సిబ్బంది ఒక్కొక్కరిని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జిల్లా పోలీసు కార్యాలయంలోని తన చాంబరులోకి పిలిచి, వారి వ్యక్తిగత, వృత్తిపరమైన, శాఖాపరమైన సమస్యలను తెలుసుకొని, వారి నుండి విజ్ఞాపనలు స్వీకరించారు. పోలీసు సిబ్బంది విజ్ఞాపనలు పరిశీలించిన జిల్లా ఎస్పీ, వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. పోలీసు సిబ్బందితెలిపిన వ్యక్తిగత, శాఖాపరమైన సమస్యలను జిల్లా ఎస్పీ స్వయంగా పుస్తకంలో నోట్ చేసుకొని, వాటి పూర్వాపరాలు పరిశీలించి, పరిష్కరించేందుకు త్వరితగతిన చర్యలు చేపడతానని తెలిపారు. (Story : పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి “పోలీసు వెల్ఫేర్ డే” )

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1