Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నతమైన వ్యక్తుల్లో ఒకరు కామ్రేడ్ సీతారాం ఏచూరి

భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నతమైన వ్యక్తుల్లో ఒకరు కామ్రేడ్ సీతారాం ఏచూరి

భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నతమైన వ్యక్తుల్లో ఒకరు కామ్రేడ్ సీతారాం ఏచూరి

న్యూస్‌తెలుగు/వినుకొండ : భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జాతీయ ప్రధాన కార్యదర్శి అమరజీవి కామ్రేడ్ సీతారాం ఏచూరి అనారోగ్యంతో ఆకస్మిక మృతి చెందడం భారతదేశ వామపక్ష ఉద్యమానికి తీరని లోటని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం జరిగిన సంతాప సభలో ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి వామపక్ష భావాలు పుణికి పుచ్చుకొని పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పోరుబాటలో పయనించిన అరుణతార సీతారాం ఏచూరి అన్నారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీని సైతం జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పదవికి రాజీనామా చేయాలని ఆమె ఇంటి వద్దకు ప్రదర్శనగా వెళ్లి ఆమె ఎదురుగా నిలబడి రాజీనామా చేయమని అడిగిన ఆనాటి యువ కమ్యూనిస్టు సీతారాం ఏచూరి అని ఆయన తెలిపారు. ప్రముఖ పార్లమెంటేరియన్ గా రాజ్యసభ సభ్యులుగా తన వాక్యాతుర్యముతో ప్రజా సమస్యల వాణిని వినిపించుటలో దిట్టగా పేరొందిన వ్యక్తి ఆయన అని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మతోన్మాద పోకడలతో ప్రజల మధ్య మత విద్వేషాలు రగిలిస్తూ అన్న దమ్ముల వలె జీవిస్తున్న ప్రజల మధ్య ద్వేషాజ్ఞులు రగిలిస్తోందని ఈ నేపథ్యంలో దేశంలో వామ పక్షాలు కలిసి పని చేయవలసిన రోజులు వచ్చాయని ఆయన ఎంతగానో ఆశించారని అన్నారు. నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తులకు అంబానీ అదాని లాంటి బడా పెట్టుబడిదారుల ఆస్తులు పెరుగుదలకు భారత దేశ ప్రజల ఆస్తులైన ప్రభుత్వ రంగ సంస్థలను పరిశ్రమలను కార్పొరేట్ కంపెనీలు అంబానీ అదానీ లకి వారి లాభాల కోసం బిజెపి దేశంలో రైతాంగానికి కార్మికులకు ద్రోహం చేసి చట్టాలను సైతం మార్చి వారి కొరకు పని చేస్తోందని పార్లమెంటులో ఇటువంటి శక్తులను ఎదిరించుటలో కమ్యూనిస్టు నేతలలో ప్రముఖుడైన సీతారాం ఏచూరి ఆకస్మిక మరణం దేశ ప్రజలకు తీరని నష్టమని ఆయన అన్నారు. ఈ సంతాప సభలో ఇంకా సిపిఎం నాయకులు బొంకూరి వెంకటేశ్వర్లు, కే. హనుమంత రెడ్డి, శివరామకృష్ణ, తదితరులు మాట్లాడుతూ దేశం ఒక నికార్సైన కమ్యూనిస్టు నేతను పేద ప్రజల సమస్యల పరిష్కారంలో పొరుబాటలో నిరంతరం పయనించిన మహోన్నత వ్యక్తి కామ్రేడ్ సీతారాం ఏచూరి అని కొనియాడారు ఆయన ఆశయాల బాటలో పేద బడుగు బలహీన వర్గాలు పయనించాలని కోరారు. సంతాప సమావేశంలో కోటిరెడ్డి, రంజాన్ బి, ఉపాధ్యాయ సంఘ నాయకులు నాగేంద్రం మాస్టారు నవీను సత్యనారాయణ పాల్గొని మాట్లాడి ఘనంగానివాళులర్పించారు. (Story : భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నతమైన వ్యక్తుల్లో ఒకరు కామ్రేడ్ సీతారాం ఏచూరి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!