UA-35385725-1 UA-35385725-1

ఎస్వీ వర్సిటీ ఆరోగ్య కేంద్రంలో : మందుల కొనుగోల్‌మాల్

ఎస్వీ వర్సిటీ ఆరోగ్య కేంద్రంలో : మందుల కొనుగోల్‌మాల్

ఉన్నతస్థాయి విచారణ కమిటీతో అవినీతిని నిగ్గుతేల్చాలి

సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు డిమాండ్

న్యూస్‌తెలుగు/ తిరుప‌తి : శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ ఆరోగ్య కేంద్రంలో గడచిన ఐదు సంవత్సరముల కాలంలో మందులు మరియు ల్యాబ్ కెమికల్స్ కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగింది. వీటిపై విచారణకుసీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు డిమాండ్ చేశారు. గోల్‌మాల్ ఎలా జ‌రిగిందంటే..

1. ఆరోగ్య కేంద్రంలో వైకాపా అవినీతి పాలనలో తాత్కాలిక ఉద్యోగులుగా చేరిన డాక్టర్ సుధాకర్ రెడ్డి, డాక్టర్ అలేఖ్య గారి పర్వేక్షణలో మందులు కొనుగుళ్ళు చేశారు. ఈ డాక్టర్లు ముఖ్యంగా మూడు మెడికల్ ఏజెన్సీస్ (1. శ్రీ కళ్యాణ్ ఫార్మా, తిరుపతి 2. శ్రీ వినాయక ఏజెన్సీస్ హైదరాబాద్ 3. బ్లూ స్టార్ ఎంటర్ప్రైజెస్, విజయవాడ) మరో రెండు సంస్థలతో అక్రమంగా లోపాయికారీ ఒప్పందం చేసుకొని దాదాపు 40 లక్షల రూపాయల నాసిరకం మందులు పై మెడికల్ ఏజెన్సీస్ నుంచి కొనుగోళ్లు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సుధాకర్ రెడ్డిని తొలిగించారు. ప్రస్తుతం జూనియర్ మెడికల్ ఆఫీసర్ గా అవతారమెత్తిన అలేఖ్య ముందస్తుగా లోపాయికారీ ఒప్పందం చేసుకున్న సంస్థల నుంచి మందుల కొనుగోళ్ళకు ప్రయత్నిస్తోంది. ఈమెకు కొనుగోళ్ళు చేసే అర్హత ఏమాత్రం లేదు.

2. గత ఐదేళ్ళుగా అత్యవసర మందుల పేరుతో లోకల్ మార్కెట్ నుంచి నాసిరకం మందులను లక్షల రూపాయలకు కొనుగోలు చేసి కమిషన్ దండుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూడా వీరి అవినీతికి అడ్డులేకుండా పోయింది.

3. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఫార్మసీ రూమ్ లో టాబ్లెట్స్ ఇవ్వాలి, కానీ ఫార్మాసిస్ట్స్ డాక్టర్ ప్రొస్క్రిప్షన్ లేకుండా వారి బంధువులకు, స్నేహితులకు, ఇతర సహా ఉద్యోగుల ఫ్యామిలీ ఫెండ్స్ కు టాబ్లెట్స్ ఇస్తున్నారు. ఫార్మసీ రూమ్ లో మందుల డిస్ట్రిబ్యూషన్ కు సంబంధిచి అకౌంటబిలిటీ లేదు.

4. డాక్టర్ అలేఖ్య అండ్ టీం అధిక కమిషన్ ఆశించి అవసరానికి మించి మందులు కొనుగుళ్ళు కు రెకమెండ్ చేస్తున్నారు. అధికంగా కొనుగోలు చేసిన మందులు పేషెంట్స్ కు ఉపయోగానికి మించి చాలా మందులు అనగా 10 నుంచి 20 లక్షల మందులు ప్రతి సంవత్సరం కాలపరిమితి ముగిసిపోయి వృథా అవుతున్నాయి.

5. ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెస్ట్స్ కు సంబంధించి దాదాపు 10 లక్షల రూపాయల కెమికల్ కొనుగోలు చేస్తున్నారు. ఆరోగ్య కేంద్రంలో తక్కువ రేట్స్ తో పేషెంట్స్ కు ల్యాబ్ టెస్ట్స్ చేస్తారు. ఈ కెమికల్స్ వలన ఆరోగ్య కేంద్రం లో బ్లడ్ టెస్ట్స్ చేయడం వలన దాదాపు 5 లక్షల రూపాయలు పేషెంట్స్ నుంచి కాష్ రూపము లో వసూలు కావలి, కానీ వేల రూపాయలు మాత్రమే వసూళ్లు వస్తున్నాయి. కారణం బ్లడ్ టెస్ట్స్ చాలా వరకు బయట నుంచి బ్లడ్ సాంపిల్స్ ను తీసుకొని బ్లడ్ టెస్ట్స్ చేసి లక్షల రూపాయలు డందుకుంటున్నారు.

6. యూనివర్సిటీ ఆరోగ్య కేంద్రం లో డెవలప్మెంట్ ఫండ్ అకౌంట్ ఉన్నదీ, ఆరోగ్య కేంద్రం లో ల్యాబ్ టెస్ట్స్ వసులు చేసిన బిల్స్ అమౌంట్ మరియు ఎక్సరే ఫిలిమ్స్ కాస్ట్స్ అమౌంట్ లను చలాన రూపం లో అకౌంట్ లో వేస్తారు. ఈ డెవలప్మెంట్ అకౌంట్ లావాదేవాల్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి.

7. ప్రస్తుతం జూనియర్ మెడికల్ ఆఫీసర్ గా అవతారమెత్తిన డాక్టర్ అలేఖ్య గారికి యూనివర్సిటీ ఆరోగ్య కేంద్రానికి సమీపంలో క్వార్టర్స్ ను free rent, free ఎలక్ట్రిసిటీ, free వాటర్ తో అలాట్ చేసారు, కారణం రౌండ్ ది క్లాక్ (24 గంటలు ఎమర్జెన్సీ పేషెంట్స్ కు అందుబారులో ఉండటానికి. కానీ డాక్టర్ గారు గత నాలుగు సంవత్సర కాలం లో ఎమర్జెన్సీ పేషెంట్స్ కు ఏరోజు అందుబాటులో ఉండరు. డాక్టర్ గారు 15 రోజులు నుంచి 20 రోజులు సెలవు పై వెళ్లిన మేడమ్ గారికి ఆఫీస్ క్లర్క్ గారు శాలరీ బిల్ పాస్ చేస్తారు. డాక్టర్ గారే కాకుండా ఆరోగ్య కేంద్రంలో ఇతర ఉద్యోగులు 15 నుంచి 20 రోజులు సెలవు పై వెళ్లినా కూడా వారికీ ఆఫీస్ క్లర్క్ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు యూనివర్సిటీ అధికారులకు తెలపకుండా శాలరీ బిల్స్ పాస్ చేస్తున్నాడు.

8. ఆఫీస్ క్లర్క్ ప్రవీణ్ కుమార్ రెడ్డిగారు ఆఫీస్ ఫైల్స్, హెల్త్ సెంటర్ డెవలప్మెంట్ అకౌంట్, మందుల కొనుగులకు సంబంధిచిన బిల్స్ ఇతర ఆఫీస్ ఫైల్స్ ఏవి కూడా సరిగా మైంటైన్ చేయడం లేదు. ఆఫీస్ క్లర్క్ గారు ఆరోగ్య కేంద్రం లో జరిగే అవకతవకల పైన యూనివర్సిటీ అధికారులకు తెలియచేసిన దాఖలాలు లేవు.

పైన సూచించిన అంశాల పైన ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసి లోతుగా విచారణ జరపి, తప్పు చేసిన అధికారులను వెంటనే విధులనుంచి తొలగించాలని రామానాయుడు డిమాండ్ చేశారు. (Story : ఎస్వీ వర్సిటీ ఆరోగ్య కేంద్రంలో : మందుల కొనుగోల్‌మాల్)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1