మంత్రి ఎస్కార్ట్ కాన్వాయ్ కు రోడ్డు ప్రమాదం
ఐదుగురు కానిస్టేబులకు గాయాలు
న్యూస్ తెలుగు /సాలూరు : మంత్రి సంధ్యారాణి ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు . రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ గిరిజన శాఖామాత్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గురువారం సాలూరు నుండి మెంటాడ మండలంలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళుచూ ఉండగా రామభద్రపురం మండలం బూసాయవలస గ్రామం వద్దకు చేరే సరికి ఒక ఐచర్ వాహనం ఆకస్మికంగా ప్రధాన రహదారి మీదకు వచ్చి, మంత్రి గారికి ఎస్కార్ట్ గా వెళ్ళుచున్న పోలీసు వాహనాన్ని ఢీ కొట్టడంతో ఎస్కార్టుగా వెళ్ళుచున్న ఐదుగురు ఆర్మ్డ్ రిజర్వు పోలీసులకు గాయాలయ్యాయి. గాయపడిన పోలీసులను మెరుగైన చికిత్స కోసం విజయనగరం తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో చేర్చి, చికిత్స అందజేస్తున్నారు.
ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే మంత్రి గుమ్మడి సంధ్యారాణి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, గురువారం తిరుమల మెడికవర్ ఆసుపత్రిని సందర్శించి, గాయపడిన (1) ఎఆర్ఎస్సై కే.వి.రమణ (2) ఎఆర్ హెచ్.సి. పి.సునీల్ (3) ఎఆర్ పిసి ఆర్.గణపతి (4) ఎఆర్ పిసి ఎం.మహేష్ (5) పోలీసు వాహన డ్రైవరు/ఎఆర్ పిసి ఎ.వి.వి.ఎస్.ఎన్.రాజు లను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును వారిని అడిగి తెలుసుకున్నారు. గాయపడిన పోలీసుల ఆరోగ్య పరిస్థితి గురించి డా. తిరుమల ప్రసాద్ మరియు ఇతర వైద్యులతో మాట్లాడి, మెరుగైన చికిత్స అందించాలని కోరారు. గాయపడిన పోలీసులతో మాట్లాడి, వారిలో ధైర్యాన్ని నింపారు. అనంతరం, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఆందోళన చెందవద్దని, అవసరమైతే ఇంకా మెరుగైన వైద్యం అందిస్తామని అన్నారు, గాయపడిన వారిని శ్రద్ధగా చూసుకోవాలని కోరారు. అవసరమైన వైద్య సహాయాన్ని అందించేందుకు ఆసుపత్రిలోనే వైద్యులకు అందుబాటులో ఉండాలని కోరారు పోలీసు అధికారులను మంత్రి సంధ్యారాణి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.