Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఉచిత గుండె వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి

ఉచిత గుండె వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి

ఉచిత గుండె వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి

36వ వార్డ్ టిడిపి ఇన్చార్జ్ రాయపాటి శివ

న్యూస్‌తెలుగు/ ధర్మవరం : పట్టణములోని రైల్వే స్టేషన్ రోడ్ కొత్తపేటలో గల సీత రామాంజనేయ కళ్యాణ మండపంలో ఈనెల 13వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత గుండె వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు 36వ వార్డు టిడిపి ఇన్చార్జ్ రాయపాటి శివ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ యొక్క శిబిరం కీర్తిశేషులు రాయపాటి గంగాధర్ నాయుడు జ్ఞాపకార్థం, కోడలు రాయపాటి శైలజ, వారి కుమారుడు రాయపాటి శివ, వారి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ శిబిరం కిమ్స్ సవేరా హాస్పిటల్ అనంతపురం వారిచే నిర్వహిస్తున్నట్లు వారు ముఖ్య అతిథులుగా టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, మంత్రి సత్య కుమార్ యాదవ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ హాజరవుతున్నట్లు కార్యనిర్వాహకులుగా గుడిపాటి సురేష్ చౌదరి నిర్వహిస్తారని తెలిపారు.ఈ శిబిరంలో జి ఆర్ బి ఎస్/బిపి/ఈసీజీ/2 డి ఎకో ఉచితంగా పరీక్షలు చేయబడినది తెలిపారు. అంతేకాకుండా గుండెనొప్పి, ఛాతి నొప్పి, గుండె దడ, ఆయాసం, కళ్ళు తిరుగుట, గుండెలో మంట కలగడం, ఛాతిలో గురువుగా ఉండడం, నిద్రలో ఆయాసం రావడం, వేచి కూర్చోవడం, కాళ్లు వాపు రావడం, చెమటలు పట్టడం లాంటి సమస్యలకు కూడా ఈ శిబిరంలో చక్కటి వైద్య చికిత్సలను అందించగలమని తెలిపారు. ఈ శిబిరానికి వచ్చేవారు తప్పనిసరిగా మాస్కు ధరించి రావాలని తెలిపారు. కావున పట్టణము, గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు ఈ యొక్క శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యమును పదిలం చేసుకోవాలని వారు తెలిపారు. (Story : ఉచిత గుండె వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!