UA-35385725-1 UA-35385725-1

సెప్టెంబరు 14 నుండి 16 వరకు శ్రీ గోవిందరాజస్వామి పవిత్రోత్సవాలు

సెప్టెంబరు 14 నుండి 16 వరకు శ్రీ గోవిందరాజస్వామి పవిత్రోత్సవాలు

న్యూస్‌తెలుగు/తిరుపతి :  తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబ‌రు 14 నుండి 16వ తేదీ వరకు జ‌రుగ‌నున్న పవిత్రోత్సవాలకు సెప్టెంబరు 13వ తేదీ సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ నిర్వహించనున్నారు.

ఈ సంద‌ర్భంగా ఉద‌యం ఆచార్య రుత్విక్‌వరణంలో భాగంగా ఋత్వికుల‌కు విధులు కేటాయించి వ‌స్త్రస‌మ‌ర్ప‌ణ చేస్తారు. సాయంత్రం ఆల‌య విమాన ప్రాకారం చుట్టూ సేనాధిపతివారిని ఊరేగింపు నిర్వ‌హించి, ఆ త‌రువాత యాగ‌శాల‌లో అంకురార్పణ కార్య‌క్ర‌మాలు చేపట్టనున్నారు.

ప‌విత్రోత్స‌వాల్లో భాగంగా సెప్టెంబరు 14న ఉదయం పవిత్రప్రతిష్ట‌, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సెప్టెంబరు 15న మూలవర్లకు, ఉత్సవర్లకు, విమాన ప్రాకారానికి, ధ్వజస్తంభానికి, మాడ వీధుల్లోని శ్రీమఠం ఆంజనేయస్వామి వారికి పవిత్రాలు సమర్పిస్తారు. సెప్టెంబరు 16న పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. ఈ మూడు రోజుల పాటు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. (Story : సెప్టెంబరు 14 నుండి 16 వరకు శ్రీ గోవిందరాజస్వామి పవిత్రోత్సవాలు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1