Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌చేనేత పరిరక్షణకై రౌండ్ టేబుల్ సమావేశం

చేనేత పరిరక్షణకై రౌండ్ టేబుల్ సమావేశం

చేనేత పరిరక్షణకై రౌండ్ టేబుల్ సమావేశం

ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణములోని కదిరిగేట్ వద్ద గల వీర బ్రహ్మంగారి ఆలయంలో ఈనెల 14వ తేదీ శనివారం ఉదయం 9:30 గంటలకు ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేనేత పరిరక్షణకై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ నేడు ధర్మవరంలో చేనేత పరిశ్రమతో పాటు చేనేత కార్మికులు కూడా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడం జరిగిందని తెలిపారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీ నాయకులు, అన్ని ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, చేనేత కార్మికులు అందరూ కూడా పాల్గొనాలని వారు తెలిపారు. ఈ సమావేశంలో 11 రకాల రిజర్వేషన్ చట్టాన్ని పొగడ్బందీగా అమలు చేయాలని, ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయమును ధర్మవరంలో ఏర్పాటు చేయాలని, చట్ట విరుద్ధంగా నిర్వహిస్తున్న జేఆర్ సిల్క్స్ ఫ్యాక్టరీ పై అధికారులు, ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని, పవర్లూమ్స్ లో చేనేతకు కేటాయించిన రకాలు వేయకూడదని తెలిపారు. అదేవిధంగా చేనేత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని తదితర అంశాలపై చర్చించడం జరుగుతుందన్నారు. కావున పెద్ద ఎత్తున అందరూ పాల్గొని ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

జే ఆర్ సిల్క్స్ ఫ్యాక్టరీ వద్ద ధర్నా వాయిదా:: మండల పరిధిలోని నాగులూరు లో గల జెఆర్ సిల్క్స్ ఫ్యాక్టరీ దగ్గర ధర్నా నిర్వహించాలన్న నిర్ణయాన్ని ఈనెల 12వ తేదీన తెలపడం జరిగిందని, కానీ వినాయక చవితి నిమజ్జనం కారణంగా ఆ ధర్నా కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగిందని వారు స్పష్టం చేశారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా తేదీని నిర్ణయిస్తామని తెలిపారు. (Story : చేనేత పరిరక్షణకై రౌండ్ టేబుల్ సమావేశం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!