రేవంత్‌తో పవన్‌కళ్యాణ్ భేటీ
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళం అందించారు. పవన్ కళ్యాణ్ సీఎం రేవంత్ రెడ్డికి చెక్ ను అందజేశారు. తెలంగాణ రాష్ట్రం కూడా వరదలతో అతలాకుతలమైన విషయం తెల్సిందే. ఏపీ వరదలతో వణికిపోయిన గ్రామాలకు పవన్ కళ్యాణ్ 6 కోట్ల రూపాయలు వితరణ అందజేశారు. ఇప్పుడు తెలంగాణకు కూడా విరాళమిచ్చారు. (Story: రేవంత్‌తో పవన్‌కళ్యాణ్ భేటీ)