ఇకనుంచి హెచ్.పీ గ్యాస్ ఆన్లైన్ బుకింగ్ ద్వారానే
లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ ఏజెన్సీదారులు గోవింద చౌదరి
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణములో లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ ద్వారా హెచ్పి గ్యాస్ తీసుకునే వినియోగదారులు ఇకనుంచి ఆన్లైన్ బుకింగ్ ద్వారానే సిలిండర్లు డెలివరీ చేయబడునని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా ఆన్లైన్ చేసుకొనే పద్ధతిని వివరిస్తూ.. కొత్త నెంబర్ 88888-23456, డీలర్ కోడ్ 41012652 కు ఆన్లైన్ బుకింగ్ ద్వారా చేయాలని, తదుపరి గ్యాస్ డెలివరీ సమయంలో ఓటిపి నెంబర్ను డెలివరీ బాయ్కు తప్పనిసరిగా తెలిపి గ్యాస్ సిలిండర్ను డెలివరీ చేసుకోవాలని తెలిపారు. ఈ బుకింగ్ ప్రక్రియ ద్వారా మాత్రమే గ్యాస్ సిలిండర్ను వినియోగదారులు పొందగలరు. కావున గ్యాస్ వినియోగదారులు సహకరించి, మీ సిలిండర్ను పొందవచ్చునని తెలిపారు. ఆన్లైన్లో ఆధార్ కార్డులోని చివరి 4 అంకెలను, మీ మొబైల్ నందు నమోదు చేయాలన్నారు. మరిన్ని వివరాలకు లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ కోర్ట్ రోడ్డు ధర్మవరం.. ఫోన్ ల్యాండ్ నెంబర్ 08559-220088కు సంప్రదించాలని తెలిపారు. (Story : ఇకనుంచి హెచ్.పీ గ్యాస్ ఆన్లైన్ బుకింగ్ ద్వారానే)