ముగిసిన గణేష్ నిమజ్జన కార్యక్రమ వేడుకలు
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ఈ నెలలో వినాయక చవితి వేడుకలు కుటుంబ పరంగా బంధువులు, కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం పట్టణములో పలు వార్డుల్లో అధిక సంఖ్యలో వినాయక చవితి విగ్రహాలను కూడా పెట్టడం జరిగింది. ఐదవ రోజుతో నిమజ్జన కార్యక్రమాలు ముగిశాయి. ఈ సందర్భంగా మంత్రి కార్యాలయ సిబ్బంది నిమజ్జన కార్యక్రమం పై సమర్థ పర్యవేక్షణ చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ ప్రజల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
నిమజ్జనం కోసం మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసి, రెండు పెద్ద క్రేన్లను ఏర్పాటు చేశారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ,వీధుల్లో పోలీసుల పర్యవేక్షణ చేపట్టారు. ట్రాఫిక్ ఇబ్బందులను నివారించేందుకు, ప్రజలకు సౌకర్యం కల్పించేందుకు అనేక చర్యలు చేపట్టారు.పోలీసు శాఖ, వైద్య, విద్యుత్తు, మరియు ఇతర విభాగాల అధికారులు ఏ చిన్న సమస్య తలెత్తకుండా పనులు పూర్తి చేసారు. మంత్రి కార్యాలయ సిబ్బంది, నిమజ్జన కార్యక్రమం సక్రమంగా సాగేలా అత్యవసరమైన సమస్యలను వెంటనే పరిష్కరించారు.చెరువు సమీపంలో క్రేన్లను ఏర్పాటు చేసినందుకు, నిమజ్జన కార్యక్రమం ఎటువంటి అడ్డంకులు లేకుండా నిర్వహించినందుకు ధర్మవరం ప్రజలు మంత్రికు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కార్యాలయం ఇన్చార్జి హరీష్, మంత్రి పిఏ మల్లికార్జున, కార్యాలయ సిబ్బంది, బిజెపి నాయకులు డోలా రాజారెడ్డి, డి.చెర్లోపల్లి నారాయణస్వామి, తదితరులు పాల్గొన్నారు. (Story : ముగిసిన గణేష్ నిమజ్జన కార్యక్రమ వేడుకలు)