నందిగం సురేష్ నోరు విప్పొద్దనే జగన్ రెడ్డి ములాఖత్ రాజకీయం
ఏ నాటికైనా జగన్ సహా అతడి బ్యాచ్ మొత్తం జైలుకే
ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
న్యూస్‌తెలుగు/ వినుకొండ : ప్రకాశం బ్యారేజీని కూల్చి లక్షలమంది ముంచాలన్న కుట్ర కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ నోరు విప్పకూడదనే జగన్ ములాఖత్ రాజకీయం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జీవీ,ఆంజనేయులు అన్నారు. ప్రజలు విపత్తులో ఉంటే సాధ్యమైన సాయం చేయాల్సింది పోయి మహావిధ్వంసానికి ప్లాన్ చేసి దొరికిపోవడంతో నిజాలు బయటపడకుండా ఉండేందుకే జగన్ పాట్లు పడుతున్నారని చురకలు వేశారు. ప్రకాశం బ్యారేజీకి అంత బరువైన పడవలు ఎలా కొట్టుకు వచ్చాయి అన్న విషయంపై నిన్నటి వరకు అనుమానంగా ఉన్న సంగతులన్నీ జగన్ రెడ్డి చర్యలతో నిజం అని నిరూపణ అవుతున్నాయని స్పష్టం చేశారు. ప్రకాశం బ్యారేజీ కూల్చేసే కుట్ర వెనక ఉన్న దుష్ట చతుష్టయం ముమ్మటికీ మాజీ సీఎం జగన్, సజ్జల, తలశిల రఘురాం, నందిగం సురేష్ అని బలంగా చెప్పగలమన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో గుంటూరు జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎంపీన నందిగం సురేష్‌ను జగన్ ములాఖత్‌లో కలవడంపై ఈ మేరకు కీలక వ్యాఖ్యానించారు . జైల్లో పోలీసులు గట్టిగా అడిగినా తమ పేర్లు ఎక్కడా చెప్పొద్దని సమాచారం చేరవేయడానికే ఆగమేఘాలపై జగన్ ములాఖత్‌కు పరుగుులు తీశాడన్నారు. ఇలాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశాడని చెప్పుకోవడానికే సిగ్గుగా అనిపిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ఒకవైపు విజయవాడ నుంచి విశాఖ, ఉత్తరాంధ్రప్రజలు వర్షాలు, వరదలతో అల్లాడిపోతుంటే మాజీ సీఎంగా చేసిన వ్యక్తి చేయాల్సిన పనులేంటి తనేం చేస్తున్నాడు అని ప్రశ్నించారు. వైకాపా లాంటి క్రిమినల్ రాజకీయ పార్టీని, జగన్ లాంటి క్రిమినల్ రాజకీయ నాయకుడిని నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో చూడలేదన్నారు. వైకాపా గొడ్డలి, కుట్రల రాజకీయాలను ప్రజలు ఎన్నికల్లో తిరస్కరించినా అతడి బుద్ధి మారక పోవడం దురదృష్టకరమని వాపోయారు జీవీ. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్ చేసిన తొలి రాజకీయ పర్యటన… నాడు నెల్లూరు జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్ అని… ఇప్పుడు గుంటూరు జైలుకు వచ్చి నందిగం సురేష్ పరామర్శకు వెళ్లాడన్నారు. జగన్ తీరు చూస్తుంటే జైళ్లలో ఉన్న వారితో ములాఖత్ అయినా పరామర్శలు చేస్తున్నాడో… రానున్న రోజుల్లో జైలుకు వెళ్లాల్సి వస్తే ఏ జైలు బావుంటుందో చూసుకుంటున్నాడో అర్థం కావడం లేదని చురకలు వేశారు. రాష్ట్రాన్ని దోపిడీ దొంగల్లా దోచుకున్న నేరాలకు, అంతుదరీ లేని హత్యా రాజకీయాలు చేసినందుకు… ఏ నాటికైనా జగన్ సహా అతడి బ్యాచ్ మొత్తం జైలుకు పోవడం మాత్రం స్పష్టమన్నారు. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టి ధ్వంసం చేయాలని చూసిన బోట్లపై ఎవరి పేర్లు ఉన్నాయో, ఏ పార్టీ రంగులు ఉన్నాయో, బోటు యజమానుల వెనక ఉన్న చీకటి శక్తులు ఎవరో అన్నీ బయటకు వస్తాయి… తొందర ఎందుకు, ఉలుకుపాటు ఎందుకు అన్నారు. విజయవాడ పోలీసులు అదే పనిలో ఉన్నారని ఎవరెవరు జైలుకు పోవాల్సి వస్తుందో త్వరలోనే చూస్తామన్నారు. ఇదే సమయంలో విజయవాడ వరదల నుంచి దృష్టి మళ్లించాల్సిన అవసరం, అగత్యం కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబుకి లేదన్నారు. విపత్తు జరిగిన రోజు నుంచి బాధితులే రోడ్డుపైకి వచ్చి శభాష్ అనే రీతిలో సహాయ, పునరావాస చర్యలు చేపట్టామన్నారు. రికార్డు సమయంలో గండ్లు పూడ్చి… విజయవాడ నగరాన్ని ముంపు నుంచి బయటకు తీసుకు వస్తున్నారనీ తెలిపారు. చేతనైతే ఆ సహాయచర్యల్లో తమవంతు సాయం చేయాల్సింది పోయి నీచమైన బురదరాజకీయాలు చేస్తున్నందుకు ప్రతిఫలం కూడా త్వరలోనే అనుభవిస్తారని జీవి అన్నారు. (Story : నందిగం సురేష్ నోరు విప్పొద్దనే జగన్ రెడ్డి ములాఖత్ రాజకీయం )