Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ 41వ శరన్నవ రాత్రుల మహోత్సవ వేడుకలు

41వ శరన్నవ రాత్రుల మహోత్సవ వేడుకలు

0

41వ శరన్నవ రాత్రుల మహోత్సవ వేడుకలు

శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం

న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణములోని తొగటవీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి యొక్క 41వ శరన్న రాత్రుల మహోత్సవ వేడుకలను అక్టోబర్ 3 వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం అధ్యక్షులు బివి.రమణ, కార్యదర్శి సిరివెళ్ల రాధాకృష్ణ, ఉపాధ్యక్షులు బంధనాదం ప్రకాష్, కాచర్ల నారాయణస్వామి, కోశాధికారి దాసరి వెంకటేశులు ( చిట్టి) తెలిపారు. వారు మాట్లాడుతూ ఈ ఉత్సవాలు ప్రతి దినం ఏడు గంటలకు అభిషేకము అలంకరణ 10 గంటలకు మహా మంగళహారతి తీర్థప్రసాద వినియోగం ఉంటుందన్నారు. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, తదితర కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అక్టోబర్ 3న బాల త్రిపుర సుందరి అలంకరణ, 4న శ్రీ మహాలక్ష్మి,5 న పద్మావతి అలంకారం,6 నా మధుర మీనాక్షి అలంకారం, 7 న గౌరీ దేవి అలంకారం, 8న లలితా దేవి అలంకారం, 9 న సరస్వతీ దేవి అలంకారం, 10 న రాజరాజేశ్వరీ దేవి అలంకారం, 12న శాంత కళా చౌడేశ్వరి దేవి అలంకారము ఉంటుందని తెలిపారు. అనంతరం 11వ తేదీన శుక్రవారం సాయంత్రం గ్రామోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కావున తొగట కుల బాంధవులందరూ కూడా ఈ శరణ్య రాత్రుల మహోత్సవ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. (Story : 41వ శరన్నవ రాత్రుల మహోత్సవ వేడుకలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version