Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఏలేరు ఉధృతి..150 గ్రామాలు గ‌జ‌గ‌జ‌

ఏలేరు ఉధృతి..150 గ్రామాలు గ‌జ‌గ‌జ‌

ఏలేరు ఉధృతి..150 గ్రామాలు గ‌జ‌గ‌జ‌

వేలాది ఎకరాలు పంటలు నీట మున‌క‌
ఐదు చోట్ల కాలువలకు గండ్లు
వ‌ణుకుతున్న పిఠాపురం

న్యూస్‌తెలుగు/కాకినాడ: ఏలేరు కాల్వ ప‌రీవాహ‌క ప్రాంతం అత‌లాకుత‌ల‌మైంది. వ‌ర‌ద దాటికి వేలాది ఎక‌రాలు నీట‌మునిగాయి. 150కిపైగా గ్రామాలు గ‌జ‌గ‌జ‌లాడాయి. గత వారం రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా కురుస్తున్న వర్షా లు ఒకపక్క అలాగే ఏలేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరగడం వ‌ల్ల‌ గేట్లు వెతివేయడంతో సుమారు 30 వేల కోసిక్యుల నీరు విడుదల చేయడంతో వర్షం నీరు వరద నీరు ఉధృతికి పిఠాపురం నియోజవర్గం ఏలూరు వరదతో గ్రామాల్లో పంట పొలాలు పూర్తిగా నీడ మునిగాయి. కాకినాడ రూర‌ల్ బీభ‌త్స‌మైంది. ఏలూరు జలాశయం నుండి అధిక మొత్తంలో నీటిని విడుదల చేయడంతో వరద నీరు 60 వేల ఎకరాలకు చేరింది. ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తివేసి అధికారులు అధికంగా నీటిని విడుదల చేశారు. వేలాది ఎకరాలు పంటలు నీట మునిగాయి. పిఠాపురం నియోజకవర్గంలో ఐదు చోట్ల కాలువలకు గండ్లు మూడు నియోజకవర్గాల్లో ఏడు మండలాల్లో ఏలేరు వరద ప్రభావం ఉంది. నియోజకవర్గంలో ఐదు చోట్ల కాలువలు గండ్లు పడి గ్రామాలను సైతం ముంచెత్తాయి. దీంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద నేషనల్ హైవే రహదారిపై నీరు రావడంతో వాహనాలు దారి మళ్ళించడం జరిగింది. అలాగే పత్తిపాడు నియోజకవర్గంలో ఏలేశ్వరం మండలం పూర్తిగా వర్ధంతికి గురైంది. కాగా సమీప జగ్గంపేట నియోజకవర్గంలో గండేపల్లి కిర్లంపూడి జగ్గంపేట మండలాలను సైతం వరద ముంచెత్త‌డంతో కిర్లంపూడి మండలంలో రాజుపాలెం వద్ద కాలువకు గండి పడటంతో వేలాది ఎకరాలు ఏలేశ్వరంలో అప్పన్నపాలెం బ్రిడ్జి మునిగాయి. ఆ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దాపురంలో వరదలకు దెబ్బకాలో బ్రిడ్జి మొత్తం కొట్టుకుపోయింది. సోమవారం రాత్రి వరకు ఉధృతి కొనసాగినప్పటికీ మంగళవారం నిలకడగా కొనసాగింది.

ఒకపక్క ప్రభుత్వ యంత్రాంగం సహాయ చర్యలు చేపట్టింది. పనులు చేపడుతుండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం గొల్లప్రోలు పిఠాపురం మండలాల్లో పర్యటించి బాధితుల నుండి వివరాలు తెలుసుకొని బాధితులకు అన్ని రకాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వారికి మంచినీరు ఆహారం తరపున చేయాలని అధికారులకు సూచించడం జరిగింది. అలాగే ఏలేశ్వరం శుద్ధగడ్డ వాగు సమస్యకు శాశ్వత పరిష్కారం త్వరలో చేపడతామని బాధితులకు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో కాలువలు పూడికలు తీయకపోవడమే ఇంతటి ప్రమాదానికి కారణమని నాయకులు ప్రజలు బహిరంగ విమర్శిస్తున్నారు. క్లోజర్ వర్క్ పేరిట కాలువలు నిర్వహణ చేసే విధానానికి గత ప్రభుత్వం పూర్తిగా స్వ‌స్థిప‌లికింద‌ని, అందుకే ఈ దుస్థితి ఏర్పడిందని రైతులు చెబుతున్నారు. గతంలో 40,000 క్యూసెక్కుల‌ నీరు విడుదల వచ్చినా కాలువలు తట్టుకునేవని, ఇప్పుడు కాలువల సామర్థ్యం తగ్గిపోయిందని కాలువలు నిండా గుర్రపు డెక్క పేరుకుపోయి వరద నీటిని ముందుకు వెళ్ళనీయకుండా ఉండటంతో గొల్లప్రోలు సుద్దగడ్డ ఏలేరు వరద చేరి కాలువలు గండ్లు పడి వేలాది ఎకరాలు ముంపు బారిన పడ్డాయని సమీప రైతులు పేర్కొంటున్నారు.

వరద ఉధృతి ఎక్కువ అవ్వడంతో కాలువ సామర్థ్యం లేక పిఠాపురం మండలంలో భోగాపురం, ఉప్పరకండి, రాపత్తి, బాగాపురం, కొండవరం, నవ కండ్రవాడ, తదితర గ్రామాల్లో గండ్లు పడి వరదల్లో చిక్కుకున్నాయి. మంగళవారం పత్తిపాడు శాసనసభ్యురాలు సత్యప్రభ, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ తమ తమ నియోజకవర్గాల్లో పంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి నిత్యావసరాలు మంచినీరు అందించి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. వరద ఉధృతి తగ్గి పంట పొలాల్లో నీరు తోడిన అనంతరం పంట నష్టాలు వేయడం జరుగుతుందని అధికారులు వెల్లడించారు. రైతులు ప్రభుత్వం పంట నష్టం అందించి, ఆదుకోవాలని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. (Story: ఏలేరు ఉధృతి..150 గ్రామాలు గ‌జ‌గ‌జ‌)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!