వీరనారి ఐలమ్మ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి : సిపిఐ
న్యూస్‌తెలుగు/వనపర్తి : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి ఉత్సవాలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సిపిఐ, సిపిఐ అనుబంధ సంఘాల జిల్లా నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం వనపర్తి అంబేద్కర్ చౌక్ లో చాకలి ఐలమ్మ 39వ వర్ధంతిని సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారత జాతీయ మహిళా సమాఖ్య ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి కళావతమ్మ, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీరామ్, ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గోపాలకృష్ణ, వనపర్తి పట్టణ కార్యదర్శి, జిల్లా కార్యవర్గ సభ్యులు జె రమేష్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎత్తంమహేష్, చందు తదితరులు మాట్లాడారు. సిపిఐ నాయకత్వంలో నిజాం నియంతత్వ సర్కారును కూల్చి, తెలంగాణ ప్రజల బానిసత్వం నుంచి విముక్తికి ప్రజల పక్షాన చేసిన ఐలమ్మ సాగించిన పోరాటం అపూర్వ మన్నారు. పోరాటంలో అనేక కష్టనష్టాలను చవి చూశారన్నారు. అలాంటి వీరవనిత జయంతి వర్ధంతులను అధికారికంగా జరపటం సమచితమన్నారు. ఈనెల 26వ తేదీన ఐలమ్మ జయంతి ఉందని దాన్ని అధికారికంగా జరపాలన్నారు. 2022లో అప్పటి కెసిఆర్ ప్రభుత్వం ఐలమ్మ జయంతి వర్ధంతి వేడుకలను అధికారికంగా జరిపేందుకు ఉత్తర్వులు ఇచ్చి, అమలు కూడా చేసిందని, దాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలన్నారు. ఆమె స్ఫూర్తితో మహిళా లోకం తమ సమస్యలపై ఉద్యమించాలన్నారు.యువత ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సిపిఐ, సిపిఐ అనుబంధ సంఘాల నేతలు ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై ఉద్యమాలను నిర్మించాలన్నారు. సిపిఐ, సిపిఐ అనుబంధ సంఘాల నాయకులు కళావతమ్మ, శ్రీరాము, గోపాలకృష్ణ, మహేష్ ఎర్రకురుమయ్య, జయమ్మ, శిరీష, ప్రవళిక, అనిత, రాంబాబు, స్వామి, మోహన్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. (Story : వీరనారి ఐలమ్మ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి : సిపిఐ)