విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆలోచనలు విరమించు కోవాలి
న్యూస్‌తెలుగు/వినుకొండ : కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏకైక భారీ పరిశ్రమ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ ఆలోచనలు విరమించుకోవాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా ఎఐటియుసి, సిఐటియు కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు వినుకొండ పట్టణంలోని శివయ్య స్తూపం సెంటర్లో ఏఐటీయూసీ నాయకులు బూదాల శ్రీనివాసరావు అధ్యక్షత వహించి నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మారుతి ముఖ్యఅతిధి గా పాల్గొని మాట్లాడుతూ 2014 లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని ఆనాడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని విభజన హామీలు అమలు చేస్తామని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నమ్మించి తీరని ద్రోహం చేశారని, ప్రత్యేక హోదా ఇవ్వకపోగా గత పది సంవత్సరాలుగా రాష్ట్రానికి చట్ట ప్రకారం ఇవ్వవలసిన నిధులను అమలు చేయవలసిన విభజన హామీలను అమలు చేయ లేదని తన సొంత రాష్ట్రమైన గుజరాత్ కు బిజెపి పాలిత రాష్ట్రాలకు నిధులను మళ్లించుకుంటూ ఆంధ్ర రాష్ట్రానికి సవతి తల్లి ప్రేమ చూపిస్తు అన్యాయం చేస్తున్నారని ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. ఈనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి రాష్ట్రానికి రావాల్సిన నిధులను ప్రత్యేక హోదాను సాధించి విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. నిన్నటి వరకు రాష్ట్రంలో ఉన్న వామపక్ష పార్టీలు కార్మిక సంఘాలు ప్రజాసంఘాలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా చేస్తున్న ఉద్యమాలకు మద్దతు తెలియజేస్తున్న నేటి అధికార టిడిపి జనసేన పార్టీలు కూటమిలో ఉన్న బిజెపి పై ఒత్తిడి తెచ్చి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నదని ఆయన తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ప్రైవేటీకరణ విధానాలను చురుకుగా అమలు చేస్తూ ప్రజల ఆస్తులైన ప్రభుత్వ రంగ సంస్థలను పరిశ్రమలను భీమారంగాన్ని బ్యాంకులను రైల్వే లను గనులను రవాణా రంగాన్ని హైవే రోడ్లను కారు చౌకగా అదాని అంబానీ లాంటి కోటీశ్వరులకు బడా పెట్టుబడిదారులకు అప్పజెప్పు చున్నారని దీనిని రాష్ట్ర ప్రజలందరూ ఐక్యంగా పోరాటాలు చేసి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదన్నారు. ఈ నేపద్యంలో విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలోని కార్మికు సంఘాలు కార్మికులు రాష్ట్రంలో ఉన్న కార్మిక సంఘాలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలుపుదల చేయుటకు 2 సంవత్సరాలు గా పోరాడుతున్నారని వారికి సంఘీభావంగా విశాఖ ఉక్కును కాపాడుకొనుటకు రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు ను జయప్రదం చేయాలని ఆయన కోరారు, ఇంకా ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కే. హనుమంతరెడ్డి, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఉలవలపూడి రాము, సిపిఐ నాయకులు పిన్నబోయిన వెంకటేశ్వర్లు,సిపిఎం పట్టణ కార్యదర్శి బొంకూరు వెంకటేశ్వర్లు, ముని వెంకటేశ్వర్లు, కోటిరెడ్డి, సిపిఐ నాయకులు పటాన్ లాల్ ఖాన్, ఎ. పవన్ కుమార్, షేక్. కిషోర్, షేక్ మస్తాన్ సోడాల సాంబయ్య కే. మల్లికార్జునరావు ధూపాటి మార్కు తదితరులు పాల్గొన్నారు. (Story : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆలోచనలు విరమించు కోవాలి)