ఆక్టోబరు 4 నుండి శ్రీ శ్రీనివాస వేద విద్వత్ సదస్సు
న్యూస్‌తెలుగు/తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేద అధ్యయన సంస్థ ఆధ్వర్యంలో ఆక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు తిరుమలలోని నాద నీరాజనం వేదికపై ప్రముఖ పండితులతో శ్రీశ్రీనివాస వేద విద్వత్ సదస్సు నిర్వహించనున్నారు.
ప్రతి రోజు ఉదయం ఉదయం 5 నుడి 6.30 గంటల వరకు చతుర్వేద పారాయణం, దేశంలోని ప్రముఖు పీఠాధిపతులు, మఠాధిపతులు, వేద పండితులతో వేద విజ్ఞనంపై సదస్సు నిర్వహించనున్నారు. ఇందులో వేదాలలోని ఆధునిక విజ్ఞానం, వేదాల్లోని సనాతన ధర్మం, వేదాల్లోని పురుషార్థలు, సమాజానికి అవసరమైన వేదభాష్యం, వేదాలలో భగవత్ తత్వం, వేదం – వేదాంగాలు, వేదం – ఉపనిషత్తుల సందేశం, తదితర అంశాలపై ఉపన్యాసించనున్నారు. (Story : ఆక్టోబరు 4 నుండి శ్రీ శ్రీనివాస వేద విద్వత్ సదస్సు)