ప్రైవేట్ ఆసుపత్రులు నిర్దేశిత ప్రమాణాలు పాటించాలి
న్యూస్‌తెలుగు/సాలూరు : ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య ఆరోగ్య శాఖ నిర్దేశించిన ప్రమాణాలను విధిగా పాటించాలని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ టి. జగన్మోహనరావు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సాలూరు పట్టణంలో పలు ప్రైవేటు ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలను(సాయి రమ్య నర్సింగ్ హోమ్, రఘు నర్సింగ్ హోమ్, లక్ష్మి హాస్పిటల్)మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్ల ధ్రువపత్రాలు, రెన్యువల్స్ సకాలంలో చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. అక్కడ పని చేస్తున్న సిబ్బంది అర్హత వివరాలపై ఆరా తీశారు. స్కానింగ్ నమోదు వివరాల రికార్డును పరిశీలించి, స్కానింగ్ కు గల కారణాలను తెలుసుకున్నారు. గర్భస్థ లింగ నిర్ధారణ చట్టం సంబంధించిన పోస్టర్లు ను పరిశీలించి ఆ నిబందలను తప్పకుండా పాటించాలని మరియు ఫార్మ్,-ఎఫ్ అనగా గర్భిణీ యొక్క స్కానింగ్ సమ్మతి పత్రము నిర్వహించాలని ఆదేశించారు. తనిఖీలకు వచ్చిన గర్భిణీ తో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు.
ఆసుపత్రులలో బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణ తీరును పరిశీలించారు. టాయిలెట్ల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. ఫైర్ సేఫ్టీ ఏర్పాట్ల నిర్వహణను పరిశీలించారు. నోటిఫైడ్ వ్యాదులైన మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, కుక్క కాటు, పాము కాటు చికిత్స వివరాలను వైద్య ఆరోగ్య శాఖ నిర్దేశించిన ఐహెచ్ఐపి పోర్టల్ లో నమోదు చేయాలని ఆదేశించారు. అనంతరం మామిడిపల్లి గ్రామంలో క్రొత్తగా ఏర్పాటు చేసిన బాలాజీ లేబరేటరినీ తనిఖీ చేసి నిర్దేశిత ప్రమాణాలను అమలు చేస్తున్న తీరును పరిశీలించారు.
గర్భిణీల వసతి గృహం పరిశీలన
సాలూరు పట్టణ పరిధిలో ఉన్న గిరి శిఖర గర్భిణీ ల వసతి గృహాన్ని జగన్మోహనరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ గర్భిణీలతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యసేవలు, పోషకాహారం వివరాలపై అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం 16 మంది గర్భిణీలు ఉండగా ఎక్కువగా తోనాం, జిఎన్ పేట పీహెచ్సీల పరిధిలో గిరిశిఖర గ్రామాల నుండి వచ్చినట్లు గుర్తించారు. ప్రతీ రోజూ వారి ఆరోగ్య పరిస్థితిపై పర్యవేక్షణ ఉండాలని, వసతిగృహ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని సిబ్బందిని అదేశించారు. మాతా శిశు సంరక్షణ కార్డులలో వారి ఆరోగ్య వివరాల నమోదును పరిశీలించి పలు సూచనలు చేశారు. అప్పుడే అక్కడకు చేరేందుకు వచ్చిన గర్భిణీ వివరాలు తెలుసుకున్నారు. పోషకాహారం గర్భిణీలకు పోషకాహార మెనూ సక్రమంగా అమలు చేయాలని ఆదేశించారు. వారి ఆరోగ్య తనిఖీల అవసరాల నిమిత్తం వినియోగిస్తున్న వాహనాల సిబ్బంది తో మాట్లాడుతూ సత్వరమే స్పందించాలని ఆదేశించారు.
ఈ తనిఖీల్లో ఆరోగ్య శాఖ డెమోలు వై.యోగేశ్వర రెడ్డి., వి.సన్యాసిరావు ఉన్నారు. (Story : ప్రైవేట్ ఆసుపత్రులు నిర్దేశిత ప్రమాణాలు పాటించాలి)