Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌విజయవాడ వరదబాధితులకు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు భారీ విరాళం

విజయవాడ వరదబాధితులకు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు భారీ విరాళం

విజయవాడ వరదబాధితులకు

ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు భారీ విరాళం

సీఎం సహాయ నిధికి రూ.25 లక్షల విరాళం 

న్యూస్‌తెలుగు/వినుకొండ : విజయవాడ వరదబాధితుల సహాయార్థం వినుకొండ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు భారీ విరాళం ప్రకటించారు . సర్వం కోల్పోయి ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్న వరబాధితులను ఆదుకోవడానికి తన శివశక్తి బయో టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ, శివశక్తి ఫౌండేషన్ ద్వారా రూ.25 లక్షలు సాయం అందిస్తామన్నారు. త్వరలోనే సీఎం చంద్రబాబును కలిసి రూ.25 లక్షల ఆర్థిక సాయాన్ని చెక్కు రూపంలో సీఎం సహాయ నిధికి అందిస్తామన్నారు. మంగళవారం విజయవాడ వరద బాధితుల కోసం బొల్లాపల్లి మండల తెలుగుదేశం పార్టీ పలువురు నాయకులు విరాళాలు సేకరించి నిత్యావసర సరుకులు కొనుగోలు చేశారు. ఆ నిత్యావసర సరుకుల వాహనాన్ని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు జెండా ఊపి ప్రారంభించారు. వినుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నుంచి వాహనాలను విజయవాడకు పంపించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే జీవీ విజయవాడ వరద విలయం, బాధితుల దయనీయ పరిస్థితులు తన మనసును ఎంతో కలిచి వేశాయన్నారు. అందుకే వారికి తనవంతు చేతనైన సాయం చేయాలని రూ. 25 లక్షల రూపాయలు విరాళం అందిస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో బొల్లాపల్లి, మూగచింతలపాలెం, మాలపాడు, గంగులపాలెం గ్రామాల నుంచి విరాళాలు సేకరించి విజయవాడ వరద ముంపునకు గురై నష్టపోయిన బాధితులను ఆదుకోవడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు విరాళాలు సేకరించి 40 క్వింటాళ్ల బియ్యం, కందిపప్పు, పామాయిల్‌ను బాధితుల కోసం పంపారన్నారు. విరాళాలు సేకరించిన బొల్లాపల్లి కోటేశ్వరరావు, సుభాని, జానీబాషా, మన్నెయ్య, వెంకటేశ్వర్లు, బాలాజీ నాయక్, షేక్ మౌలాలి, రంగయ్య, తదితరులను అభినందించారు. వరద బాధితులను ఆదుకోవడానికి సహాయం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. విపత్తుల సమయంలో ఇలాంటి సేవాభావాన్ని ప్రతిఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమములో మండల పార్టీ అధ్యక్షుడు జరపాల గోవింద నాయక్, పెమ్మసాని నాగేశ్వరరావు, ఆరెకట్ల వాసుదేవరెడ్డి, తిప్పిశెట్టి వెంకటేశ్వర్లు, ఎలిశెట్టి రంగయ్య, హనుమా నాయక్, బా రెడ్డి వెంకటేశ్వర రెడ్డి, కోటేశ్వరరావు, ఏడుకొండలు, రామచంద్రయ్య, పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు. (Story : విజయవాడ వరదబాధితులకు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు భారీ విరాళం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!