UA-35385725-1 UA-35385725-1

మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ

మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ

న్యూస్‌తెలుగు/వనపర్తి : చాకలి ఐలమ్మ ధైర్యం, తెగువ చూపుతూ ఆనాటి దేశ్ ముఖులు, రజాకార్ల గుండెల్లో భయం పుట్టించిందని, మహిళలకు స్ఫూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఒకవైపు సాయుధ పోరాటం చేస్తూనే, మరోవైపు అమ్మ లాగా ఉద్యమకారులకు అన్నం పెట్టి ఆదరించిన మహనీయురాలని పేర్కొన్నారు. మంగళవారం చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా వనపర్తి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి మాట్లాడుతూ రజాకార్ల కాలంలో రైతుల పట్ల, మహిళల పట్ల జరిగిన దౌర్జన్యాలకు ఎదురొడ్డి కొట్లాడారని, ప్రజల్లో అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడటంలో స్ఫూర్తిని నింపారని కొనియాడారు. అనాడు నిరంకుశ నిజాం రజాకార్లను, దేశ్ ముఖులను ఎదుర్కొన్నదని అన్నారు. నిజాం పాలన, విస్నూరు దేశ్ ముఖ్ కి వ్యతిరేకంగా పోరాడిన యోధురాలు ఐలమ్మ అని అన్నారు.
సంఘ నాయకులు, అధికారులతో కలిసి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూల మాల వేసి నివాళుల్పించారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, అదనపు కలక్టర్ రెవెన్యూ యం. నగేష్, బి.సి. సంక్షేమ శాఖ అధికారి బి సుబ్బా రెడ్డి, సంఘం నాయకులు పాలకొండ సత్యనారాయణ, టి. ఆంజనేయులు, జి.జే .శ్రీనివాసులు, శ్రీనివాసులు, డి. చంద్ర శేఖర్, గంధం నాగరాజు, ఆంజనేయులు, శేఖర్, తదితరులు పాల్గొన్నారు. (Story : మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1