వరుస దొంగతనాలను ఛేదించిన పోలీసులు
నిందితులు అరెస్టు రిమాండ్ కు తరలింపు
ఏటూరు నాగారం ఎస్సై తాజుద్దీన్
న్యూస్ తెలుగు /ఏటూరునాగారం (ములుగు ): ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో గత కొన్ని రోజులుగా వరుస దొంగతనాలు జరుగుతుండడంతో. దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను ఏటూరు నాగారం ఎస్సై తాజుద్దీన్ చౌక చక్యంగా ప్రతిరోజు నిత్యం రాత్రులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ నిందితులను పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై తాజుద్దీన్ మాట్లాడుతూ ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన చూస్తూ ఊరుకునేది లేదని,చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యాపారస్తులు,ఇంటి యజమానులు, మీ యొక్క వ్యాపార సముదాయాల ముందు మీ ఇంటి ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఇట్టి ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అన్నారు.ఈ సందర్బంగా దొంగతనాలకు పాల్పడిన వారి వివరాలు వెల్లడించారు. తేదీ 24-08-2024 రోజున ఏటూరునాగారం సాయిబాబా దేవాలయంలో ప్రధాని పూజారి బాను ప్రకాష్ శర్మ .సాయి బాబా దేవాలయo-లో హుండి దొంగతనం జరిగిందనిఫిర్యాదు ఇవ్వగా, తేదీ:-05-09-2014 రోజున ఏటూరునాగారం ఎస్సై తాజుద్దీన్ తన సిబ్బందితో, ఏటూరు నాగారం ఏరియాలో సాయంత్రం 05:00 గంటలకు వాహనాలు తనిఖీ చేస్తుండగా,అక్కడ ఒక వ్యక్తి అనుమానస్పదంగా ఉండగా ,అతడిని అదుపులోకి తీసుకొని, విచారించగా, అతని పేరు నునమoతుల గాలయ్య , తిమ్మంపేట గ్రామం,మంగపేట మండల గ్రామస్తుడు. ఏటూరు నాగారం సాయిబాబా దేవాలయంలో. దొంగతనం చేసినది నేనేనని అతడు నేరాన్ని ఒప్పుకొన్నాడని,మరియు కమలాపూర్ లోని సాయిబాబా దేవాలయo హనుమాన్ దేవాలయంలో దొంగతనం చేసింది నేనేనని చెప్పగా అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించమన్నారు.అదేవిదంగా
తేది 03-09-2024 రోజున ఏటూరానాగారం గ్రామనికి చెందిన గంపల లక్షి . ఆమె కూతురు గద్దల సృజన ఇద్దరు రాత్రి) 3:00 గంటల సమయంలో అనుమానస్పదంగా తిరుగుతుండగా, వారిని అదుపులోకి తీసుకొని విచారించగా, వారు రాత్రి సమయంలో గ్యాస్ సిలండర్స్ ని దొంగతనం చేస్తున్నారని,ఒప్పుకున్నారన్నారు.పిర్యాదు చేసిన చేన్న గణపతి,ఇంట్లో 2 గ్యాస్ సిలిండర్స్ పొయినవి, లింగం లక్ష్మి నర్సింహరావు ఇంట్లో 1 గ్యాస్ సిలిండర్స్ దొంగలించినారని పేర్కొన్నారు.వారిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. (Story : వరుస దొంగతనాలను ఛేదించిన పోలీసులు)