Home వార్తలు తెలంగాణ రాబోవు రెండు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రాబోవు రెండు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

0

రాబోవు రెండు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఏటుర్ నాగారం ఎస్ ఐ తాజుద్దీన్

న్యూస్ తెలుగు /ఏటూరునాగారం (ములుగు ) : గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో,మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని,ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ జారీ చేసిన సూచన మేరకు,ఎల్లో అలర్ట్ ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్,
ఏటూరు నాగారం ఏఎస్పీ శివమ్ ఉపాధ్యాయ ఆదేశాల మేరకు. ఏటూరు నాగారం. సీఐ అనుముల శ్రీనివాస్ సూచనల మేరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఏటూరు నాగారం ఎస్సై తాజుద్దీన్ ఒక పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఎస్ ఐ తాజుద్దీన్ మాట్లాడుతూ,భారీ వర్షపాతం నమోదయే అవకాశాలు ఉన్నాయన్నారు.అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రావద్దని, ఎట్టి పరిస్థితుల్లో వాగులలో రిజర్వాయర్లలో చేపల వేటకు వెళ్లకూడదని పేర్కొన్నారు.వాగులు దాటే ప్రయత్నం అసలు చేయకూడదని ,ఆకస్మికంగా వరద పెరిగే అవకాశాలు ఉన్నాయని ,భారీ వర్ష సూచన కారణంగా,పిడుగులు పడే అవకాశం ఉన్నందున, పశువుల కాపరులు అడవులలోకి వెళ్లకూడదని, తడిదనం వల్ల విద్యుత్ ఘాతానికి లోనయ్యే అవకాశం ఉన్నందున,విద్యుత్ స్తంభాలను ముట్టుకోరాదన్నారు.శిధిలావస్థలో ఉన్న నివాసాలలో ఉంటున్న వారు వెంటనే ఖాళీ చేసి తమ బంధువుల ఇల్లలోకి గాని, రక్షణ శిబిరాలలోకి గాని వెళ్లాలని ఎస్సై తాజుద్దీన్ తెలిపారు. (Story : రాబోవు రెండు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version