గీతమ్స్ హై స్కూల్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు
న్యూస్‌తెలుగు/ వినుకొండ : స్థానిక నరసరావుపేట రోడ్డులో ఉన్న గీతమ్స్ హైస్కూల్ లో శుక్రవారం ముందస్తు వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గీతమ్స్ విద్యాసంస్థల కరస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వినాయక చవితి యొక్క ప్రాముఖ్యత విద్యార్థులకు వివరిస్తూ మాట్లాడారు. భారతీయుల అతిముఖ్య పండుగలలో ఇది ఒక పండగ. పార్వతి, పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. హిందూధర్మశాస్త్రాలు ప్రతిరోజూ వేద శ్లోకాలు , ప్రార్థనలు, పూజలు జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. (Story : గీతమ్స్ హై స్కూల్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు)

