రోగులకు సేవ చేయడం దైవ సేవతో సమానం..
శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్లు
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : రోగులకు సేవ చేయడం దైవ సేవతో సమానమని శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని 360 మంది రోగులకు భోజనపు ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్స్ ఆసుపత్రి సిబ్బంది చేతుల మీదుగా రోగులకు అందజేశా రు. అనంతరం గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్ అని కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ మాట్లాడుతూ ఈ సేవా కార్యక్రమానికి దాతలుగా కీర్తిశేషులు దాసరి తులసమ్మ జాపకార్థం భర్త వెంకటస్వామి నిర్వహించడం పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు. దాతల సహాయ సహకారాలతోనే ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ మాధవి మాట్లాడుతూ శ్రీ సత్యసాయి సేవా సమితి వారు చేస్తున్న సేవలు రోగులకు వరంగా మారాయని, వారి సేవలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఉంటాయని తెలిపారు. అనంతరం సూపర్డెంట్ సత్య సాయి సేవ సమితి వారికి ఆసుపత్రి తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటువంటి సేవా కార్యక్రమాలకు ఆసక్తి గల దాతలు సెల్ నెంబర్ 9966047044 గాని 903044065కు గాని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు చంద్రశేఖర్, రెడ్డప్ప, రామకృష్ణ, వెంకటేశ్వర్లు, పద్మ తో పాటు 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు. (Story : రోగులకు సేవ చేయడం దైవ సేవతో సమానం.. )