పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక. సురేష్ కుమార్.
న్యూస్ తెలుగు /ములుగు :భారీ వర్షాల కారణంగా మూడు మండలాల్లో దెబ్బతిన్న పంటలు, ప్రాధమిక అంచనా వివరాలు ప్రభుత్వానికి పంపడం జరిగినదని,జిల్లా వ్యవసాయ అధికారి వి. సురేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా, మూడు మండలాల్లో వరి పంటకు నష్టం వాటిల్లిందని,మూడు రోజుల పాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో, వరి పంట నీటిలో మునిగిపోవడం, ఇసుక మేటలు వేయడంతో,రైతుల వరి పంట కోల్పోయారన్నారు.వర్షం కారణంగా దెబ్బతిన్న, పంటల రైతులను అన్ని విధాలుగా ఆదుకోడానికి ప్రభుత్వం నివేదికలు కోరినదని, జిల్లాలో సెప్టెంబర్ మొదటి వారంలో, భారిగా కురిసిన వర్షాలకు గోవిందరావుపేట మండలంలో 485 రైతులకు చెందిన 610 ఎకరాల వరి పంట దెబ్బతినగా, తాడ్వాయి మండలంలో 625 రైతులకు చెందిన 900 ఎకరాలు, ఏటూరునాగారం మండలంలో 20 రైతులకు చెందిన 30 ఎకరాల వరి పంట, జిల్లా లో మొత్తం1130 రైతులకు చెందిన 1540 ఎకరాలాలో పంట నష్టం జరిగినట్లు ప్రాధమిక అంచనా వేయడం జరిగిందని పేర్కొన్నారు. నివేదిక ప్రభుత్వానికి పంపడం మైనదని, జిల్లా వ్యవసాయ అధికారి వి. సురేష్ కుమార్ తెలిపారు.మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తిరణ అధికారి పంట నష్టం జరిగిన పొలాలను ,పరిశీలించి 33 శాతం కన్నా ఎక్కువ పంట నష్టం జరిగిన రైతుల వివరాలు సేకరిస్తున్నామని ఆయన తెలిపారు.(Story:పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక. సురేష్ కుమార్.)