గోదావరి పరివాహక ప్రాంతాలను పరిశీలించిన ఎంపీ బలరాం నాయక్
గోదావరి ఒడ్డున కోతకు గురవుతున్న భూములకు నష్ట పరిహారం అందించాలని ముఖ్యమంత్రి ద్రుష్టికి తీసుకెళ్తాం
అకాల వర్షాల వలన, ఇండ్లు పంట పొలాలు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందించే విధంగా చర్యలు చేపడుతాం
న్యూస్ తెలుగు /ములుగు : అకాల వర్షాల వల్ల ఇండ్లు, పంట పొలాలకు నష్ట పోయిన రైతులకు, నష్ట పరిహారం అందించేందుకు విధంగా చర్యలు చేపట్టుతామని మహబూబాబాద్ ఎం పీ పోరిక బాల రాం నాయక్ తెలిపారు.శుక్రవారం
మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ ఏటూరునాగారం మండలంలోని గోదావరి పరివాహక ప్రాంతాలను పరిశీలించి,అనంతరం ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ ఏటూరునాగారం మండలంలోని గోదావరి పరివాహక ప్రాంతాలను పరిశీలించడం జరిగిందని,గోదావరి ఒడ్డున ఉన్నటువంటి 200 పైగా ఎకరాలు కోతకు గురవడం జరిగిందన్నారు.ములుగు ఏజెన్సీగ్రామాలలో ఇండ్లు తాత్కాలికంగా దేబ్బతిన్న గోడలు కూలిపోయిన వాటికీ,ప్రాంత ప్రజల రైతులు కోతకు గురైనటువంటి భూములకు, పంట పొలాల రైతులకు నష్ట పరిహారం అందించే విధంగా ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి, మంత్రి వర్గానికి తెలియజేసి,నష్ట పరిహారం అందించే విధంగా చర్యలు చేపడతామని,అదేవిధంగా ఎవరైతే ఇండ్లు కూలినటువంటి ప్రజలు ఉన్నారో, సమగ్ర సర్వే చేపట్టి వారి కూడా నష్టపరిహారం అందిస్తామని తెలిపారు.అకాల వర్షాల వలన ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఎటువంటి జబ్బున పడకుండా ముందస్తుగా శానిటేషన్ పనులు నిర్వహిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చిటమట రఘు, జిల్లా కార్యదర్శి గుడ్ల దేవేందర్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు ఖలీల్ ఖాన్, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి ముక్కెర లాలయ్య, మండల ఉపాధక్షుడు రియాజ్, జిల్లా యూత్ కార్యదర్శి గౌస్,మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య, యూత్ అధ్యక్షుడు గద్దల నవీన్,టౌన్ అధ్యక్షుడు సులేమాన్, వర్కింగ్ ప్రెసిడెంట్ సరికొప్పుల శ్రీనివాస్, యూత్ జిల్లా ఉపాధ్యక్షుడు సర్వ అక్షిత్, చోలం వికాస్, కొగిలా రాజు, భారత్,గాయాజ్ తదితరులు పాల్గొన్నారు. (Story : గోదావరి పరివాహక ప్రాంతాలను పరిశీలించిన ఎంపీ బలరాం నాయక్)