Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ డాక్టర్ సత్య నిర్ధారన్ కు మ‌ద‌ర్‌థేరిస్సా అవార్డు

డాక్టర్ సత్య నిర్ధారన్ కు మ‌ద‌ర్‌థేరిస్సా అవార్డు

0

డాక్టర్ సత్య నిర్ధారన్ కు మ‌ద‌ర్‌థేరిస్సా అవార్డు

ఈ అవార్డు పేద ప్రజలకే అంకితం.. డాక్టర్ సత్య నిర్ధారన్

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) :  పట్టణంలోని డాక్టర్ సత్య నిర్ధారణ గత పది సంవత్సరాలుగా రెడ్ క్రాస్ సొసైటీలో విశేష సేవలు అందించినందున, కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని సోమల రాజు ఫౌండేషన్ 12 వ వార్షికోత్సవం సందర్భంగా వారికి మదర్ తెరిసా అవార్డు లభ్యం కావడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ సత్య నిర్ధారణ మాట్లాడుతూ తాను పట్టణములో వైద్య, విద్య, తదితర వాటిలో పేద ప్రజలకు వివిధ సేవలు చేయడం జరిగిందన్నారు. శ్రీ సత్య సాయి జిల్లాలో నాకు మాత్రమే ఈ అవార్డు రావడం నిజంగా అభినందించేదగ్గ, సంతోషించదగ్గ విషయమని తెలుపుతూ ఈ అవార్డు పేద ప్రజలకే అంకితం అని తెలిపారు. తదుపరి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో 110 మందికి ఈ అవార్డు లభ్యమయిందని తెలిపారు. ఈ అవార్డును ఈనెల 14వ తేదీ శనివారం బెంగళూరు జక్కరు లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సముదాయ భవనంలో జాతీయ అవార్డుల ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో తాను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా గత 30 సంవత్సరాలుగా ఎన్జీవో లతో ధర్మవరం వృద్ధుల కోసం దివ్యాంగుల కోసం దీర్ఘకాలిక బాధితుల కోసం 1,20,000 మందికి ఉచిత వైద్య సేవలను అందించడంతోపాటు వైద్య శిబిరాలను కూడా తాను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇటీవల వృద్ధుల సామాజిక ఆరోగ్య ప్రణాళికల కేంద్రం బత్తలపల్లి నందు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గౌతమ బుద్ధ వికాస సేవా సమితి స్థాపించి, గౌతమ బుద్ధ హరిత వికాస వృద్ధుల విడదీ పర్యాటక కేంద్రమును కూడా నిర్మించడం జరుగుతుందని తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ లైఫ్ మెంబర్గా, 150 ఐఆర్సిఎస్ లైఫ్ మెంబర్గా చేర్పించడం జరిగిందన్నారు. 1600 మంది చే పది రక్తదాన శిబిరాలు, గత పది సంవత్సరాలుగా 20 అవార్డులు అందుకోవడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా జి రసం సభ్యుడిగా, సాహితీ కార్యక్రమాలు చార్వక కార్యకర్తగా, వాయిస్ ఆఫ్ చార్వక ఉపసంపాదకులుగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నానని తెలిపారు. ఈ అవార్డు పట్ల రెడ్ క్రాస్ పలు సీనియర్లు, జూనియర్లు, విద్యావేత్తలు, అధికార, అనధికారులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.(Story : డాక్టర్ సత్య నిర్ధారన్ కు మ‌ద‌ర్‌థేరిస్సా అవార్డు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version