ఉచిత వక్త శిక్షణా తరగతులు
న్యూస్‌తెలుగు/వినుకొండ : డిగ్రీ నుండి పీజీ వరకు చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ఈ నెల 14, 15 తేదీలలో ఉచిత వక్త శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని స్టెప్ సమన్వయకర్తలు టి.వేణుగోపాలరావు (రిటైర్డ్ ఎస్ఐ), నంబుల రాంబాబు యాదవ్ తదితరులు పాల్గొంటారని ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థినీ, విద్యార్థులలో ఉన్న ఆత్మన్యూనతాభావాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని నింపి తద్వారా వారు అనుకున్న లక్ష్యాలకు చేర్చడానికి ఈ వక్తా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని, ఈ శిక్షణా తరగతులలో పాల్గొనే విద్యార్థులకు ఉచిత వసతి, భోజన మరియు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇవ్వబడుతుందని తెలిపారు.
ఈ శిక్షణా తరగతులు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామంలో ఉన్న ధ్యాన కేంద్రంలో జరుగుతాయని కావున ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొనదలచిన విద్యార్థిని, విద్యార్థులు 90 306 44 44 0 , 81 432 34 555 నంబర్లకు ఫోన్ చేసి మీ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరారు. (Story : ఉచిత వక్త శిక్షణా తరగతులు)