UA-35385725-1 UA-35385725-1

భోగాపురం విమానాశ్రయం 40 శాతం పనులు పూర్తి

భోగాపురం విమానాశ్రయం 40 శాతం పనులు పూర్తి

కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు

న్యూస్‌తెలుగు/విజయనగరం : (భోగాపురం) అంతర్జాతీయ విమానాశ్రయ పనులు శర వేగంగా జరుగుతున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఇప్పటికే 40 శాతం పనులు పూర్తి అయ్యాయని, విమానాశ్రయ నిర్మాణాన్ని ఆరు నెలల ముందే పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. పనుల స్థితిగతుల గురించి అధికారులను, జిఎంఆర్ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. రన్ వే, టెర్మినల్ భవనం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కింజరాపు విలేకరులతో మాట్లాడుతూ, 2026 జూన్ నాటికి భోగాపురం విమానాశ్రయాన్ని పూర్తిచేసి, ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు జిల్లా యంత్రాంగం, స్థానికులు నుంచి కూడా సంపూర్ణ సహకారం అందుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫూర్తితో ప్రతినెలా విమానాశ్రయ నిర్మాణాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. గత నెలలో పరిశీలించే సమయానికి సుమారు 36% పనులు జరిగాయని, ప్రస్తుతం దాదాపు 40 శాతం వరకు పూర్తి కావస్తున్నాయని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో, అత్యాధునిక నమూనా తో ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతోందన్నారు. భూములు ఇచ్చిన నిర్వాసితులకు అన్నివిధాలా న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని అన్నారు. ఎయిర్పోర్ట్ పూర్తి అయితే ఉత్తరాంధ్ర ఎంతో అభివృద్ధి చెందుతుందనీ, ప్రపంచం నలుమూలల నుంచీ ఇక్కడ ఉద్యోగాలు చేసేందుకు తరలి వస్తారని చెప్పారు. దేశంలో పౌర విమానయాన రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతుందనీ, పదేళ్ళ క్రితం 74 ఎయిర్పోర్ట్ లు ఉండగా, ప్రస్తుతం 157 కి పెరిగాయని చెప్పారు. భవిషత్ లో వీటి సంఖ్య 400 కు చేరుతుందని తెలిపారు. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. ఆయన మొదటి రోజు నుంచే కలెక్టరేట్ ను క్యాంప్ ఆఫీసు గా చేసుకొని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ప్రకృతి విపత్తులను కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి బాధ్యతా రహితంగా, రాజకీయం చేస్తున్నారని అన్నారు. నష్టాన్ని అంచనా వేసిన వెంటనే, వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ పర్యటనలో ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు, నెల్లిమర్ల శాసన సభ్యురాలు లోకం నాగ మాధవి, జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, ఎస్పీ వకుల్ జిందాల్, జిఎంఆర్ సీఈవో మనోమే రాయ్, సిడివో ఎం. కోటేశ్వరరావు, ఆర్డిఓ ఎంవి సూర్యకళ, తహసీల్దార్ సురేష్, ఇతర అధికారులు, జిఎంఆర్, ఎల్ అండ్ టి సంస్థల ప్రతినిధులు, టీడీపి నాయకులు పాల్గొన్నారు. (Story : భోగాపురం విమానాశ్రయం 40 శాతం పనులు పూర్తి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1