48 కేజీల ప్లాస్టిక్ వస్తువుల స్వాధీనం
ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి శ్రీనివాస్
న్యూస్తెలుగు/విజయనగరం : ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దే క్రమంలో కమిషనర్ పి.నల్లనయ్య ఆదేశాలతో శుక్రవారం నగరంలో పలు ప్లాస్టిక్ దుకాణాలలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి నేతృత్వంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. మొత్తం మూడు షాపులలో తనిఖీలు నిర్వహించి 48 కేజీల ప్లాస్టిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిషనర్ పి.నల్లనయ్య ఆదేశాల మేరకు నగరంలో నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు విక్రయ దుకాణాల పై దాడులు నిర్వహించామన్నారు. పలు దుకాణాలలో విక్రయిస్తున్న నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను స్వాధీనం చేస్తున్నామని, మరల ఇటువంటి అమ్మకాలు పునరావృతం అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్య పర్యవేక్షకులు పాల్గొన్నారు. (Story : 48 కేజీల ప్లాస్టిక్ వస్తువుల స్వాధీనం)